Arya 20 Years: జీవితాన్ని మార్చిన క్షణమది!
ABN , Publish Date - May 07 , 2024 | 01:34 PM
‘‘ఆర్య’కు 20 సంవత్సరాలు. ఇది సినిమా రిలీజ్ డేట్ మాత్రమే కాదు. నా జీవితాన్ని మార్చిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్.
‘‘ఆర్య’కు (Arya) 20 సంవత్సరాలు. ఇది సినిమా రిలీజ్ డేట్ మాత్రమే కాదు. నా జీవితాన్ని మార్చిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'ఆర్య’. ఆ చిత్రం బన్నీ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు.. ఎంతోమంది లైఫ్ ఇచ్చింది. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వన్ సైడ్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌కి యూత్ అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రం విడుదలై మంగళవారానికి 20 ఏళ్లు పూర్తయింది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆర్య చిత్రానికి సంబంధించిన విశేషాలు హల్‌చల్ చేస్తున్నాయి. హీరో అల్లు అర్జున కూడా ‘ఆర్య’ రోజులను గుర్తుచేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. స్వీట్ మెమొరీస్ అంటూ ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం బన్నీ ట్వీట్ వైరల్ అవుతోంది.
‘అల్లు అర్జున్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది. ఆ ఒక్క సినిమా నా జీవితాన్ని, తన కెరీర్‌ను మార్చేసింది’ అని సుకుమార్ పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే! అయితే ఈ రోజు సాయంత్రం 'ఆర్య' టీమ్ 20 ఈయర్స్ సెలబ్రేషన్స చేసుకోనుందని తెలుస్తోంది. టీమ్ అంతా రీ యూనియన ప్లాన చేశారట. ఈ పార్టీకి అల్లు అర్జున, సుకుమార్, దిల్‌రాజు కూడా పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి.