Ghaati: అనుష్క.. లేటైనా అద‌ర బెద‌ర‌గొట్టిందిగా

ABN , Publish Date - Nov 07 , 2024 | 09:02 PM

అనుష్క, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మ్యాసీవ్ పాన్ ఇండియా మూవీ ఘాటితో రాబోతుంది. ఈ రోజు అనుష్క జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌లో అనుష్క మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌ టెర్రిఫిక్ గా ఉంది.

anushka

క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty)చాలా యూనిక్ స్క్రిప్ట్‌లని ఎంపిక చేసుకుంటున్నారు. ఒక స్క్రిప్ట్ ని ఎంచుకున్నప్పుడల్లా ప్రాజెక్ట్ చుట్టూ అంచనాలు భారీగా ఉంటున్నాయి. బాహుబలి సిరీస్ మూవీస్ తర్వాత, అనుష్క, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మ్యాసీవ్ పాన్ ఇండియా మూవీ ఘాటి (Ghaati) తో రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న ఈ హై బడ్జెట్ చిత్రంపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈరోజు విడుదలైన ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, మేకర్స్ క్వీన్ అనుష్క ఫెరోషియస్ అవాతర్ ని పరిచయం స్పైన్ చిల్లింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఆదివాసీ ప్రజలు తమ వస్తువులన్నింటినీ తీసుకుని కొండపైకి నడుస్తుండతో గ్లింప్స్ మొదలవుతుంది, కార్లలో కొంతమంది వ్యక్తులు ఘాట్ రోడ్లపైకి వస్తారు. తన శరీరం అంతటా ట్రైబల్ టాటూస్ తో, సిటీ బస్సు వైపు కొడవలితో నడుచుకుంటూ వచ్చిన అనుష్క స్టన్నింగ్ ఎంట్రీ అదిరిపోయింది. అనుష్క బస్సులోకి ఎంటరై ఒక వ్యక్తి మెడను నరికి అద్దంలో తనను తాను చూసుకోవడం టెర్రిఫిక్ గా ఉంది. అతని మెడ నరికిన తర్వాత, రక్తం చిందే తలని పట్టుకొని నడుస్తూ, ఆపై పొగ తాగుతున్నట్లు కనిపించిన విజువల్స్ అదిరిపోయాయి. అనుష్క మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌ టెర్రిఫిక్ గావుంది. గ్లింప్స్ లోని ప్రతి ఫ్రేమ్‌ అద్భుతంగా వుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఇంటెన్స్ ని యాడ్ చేసింది.


WhatsApp Image 2024-11-07 at 7.36.54 PM.jpeg

క్వీన్ అనుష్క తాను ఎలాంటి పాత్రనైనా పోషించగలనని మరోసారి తన వెర్సటాలిటీని ప్రజెంట్ చేశారు. ఇలాంటి ఫెరోషియస్ యాక్షన్ ఓరియెంటెడ్ సీన్స్ ఆమెకు మాత్రమే పెర్ఫెక్ట్. ఆమె అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఘాటి సినిమాలో టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఘాటీ' ప్రస్తుతం ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Updated Date - Nov 07 , 2024 | 09:02 PM