Anupama Parameswaran: టిల్లు.. ఇష్టం లేకుండా అంగీకరించా.. అతని సలహాలు నచ్చేవి కాదు!
ABN , Publish Date - Mar 26 , 2024 | 03:29 PM
ఎప్పుడు సున్నితంగా మాట్లాడే అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు కాస్త గరంగరంగా మాట్లాడుతోంది. సున్నితత్వాన్ని పక్కనపెట్టి ఘాటుగా స్పందిస్తోంది, సెటైర్లు వేస్తోంది. ఆమెలో ఈ మార్పునకు ఈ మధ్యన తరచూ ఎదురవుతున్న ప్రశ్నే కారణం.
ఎప్పుడు సున్నితంగా మాట్లాడే అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఇప్పుడు కాస్త గరంగరంగా మాట్లాడుతోంది. సున్నితత్వాన్ని పక్కనపెట్టి ఘాటుగా స్పందిస్తోంది, సెటైర్లు వేస్తోంది. ఆమెలో ఈ మార్పునకు ఈ మధ్యన తరచూ ఎదురవుతున్న ప్రశ్నే కారణం. ఇప్పటిదాకా పక్కింటి అమ్మాయిగా, ఎక్స్‌పోజింగ్ లేకుండా తెరపై కనిపించిన ఆమె ‘టిల్లు స్వ్కేర్’ (Tillu Square) కోసం కాస్త హద్దు దాటి స్కిన్ షోకి (Skin show)రెడీ అయ్యారు. ఈ చిత్రంలో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఆమెపై కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో చేసిన సినిమాల్లో కంటే అనుపమ ఇందులో గ్లామర్‌గా కనిపిస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అనూ తెరపై అలా కనిపించడం ఆమె అభిమానులకు నచ్చడం లేదు. దాంతో అనుపమాను 'గ్లామర్ డోస్ ఎందుకు పెంచారు.. మేం మీ నుంచి ఇలా ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు.. ఎప్పటిలాగే సంప్రాదాయంగా కనిపించండి’ అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో విసిరిగిపోయిన అనుపమా ఘాటుగా స్పందిస్తోంది. 'నాకు రోజు బిర్యానీ ఇష్టమని రోజు తినలేనుగా.. నాకు పులావ్ కావాలి, పులిహోర కావాలి అన్ని రకాల రుచులు చూడాలి. అలాగే అన్ని రకాల పాత్రలు చేయాలి’ అని ఇటీవల ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. తాజాగా మరోసారి ఇదే విషయంపై ఆమె స్పందించారు.
"స్క్రీన్ పై ఒక అమ్మాయి హాట్‌గా కనిపించడం ఎంత కష్టమో మీకు తెలుసా? నాకు ఈ సినిమాతో అది ఎంత కష్టమో అర్థమైంది. చూసిన వాళ్లందరూ గ్లామర్‌గా ఉండే పాత్రలు చేస్తుందని సింపుల్‌గా కామెంట్స్ మాట వదిలేస్తున్నారు. అలాంటి పాత్ర చేయడం చాలా ఇబ్బంది. కొన్ని కాస్ట్యూమ్స్ స్క్రీన్ పై చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంటాయి. కానీ, అవి వేసుకుని సెట్‌లో అంతమంది ఎదుట ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాకు మాత్రమే తెలుస్తుంది. మరికొన్ని కాస్ట్యూమ్స్‌కు మొత్తం అద్దాలతో చేసిన వర్క్ ఉంటుంది. అవి చర్మానికి గీసుకుపోతుంటాయి. ఇలాంటివన్నీ భరిస్తేనే తెరపై గ్లామర్‌గా కనిపిస్తారు. ఇలాంటి ఇబ్బందులు పడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న నటీమణులందరినీ మెచ్చుకోవాలి. ‘టిల్లు స్క్వేర్’కు ఇష్టం లేకుండానే అంగీకరించాను. షూటింగ్ ప్రారంభించాక సిద్థూ ప్రతి విషయంలోనూ సలహాలు ఇచ్చేవాడు. నాకు నచ్చేది కాదు. ఆ తర్వాత అతడికి సినిమాపై ఉన్న ఆసక్తి అర్థం చేసుకున్నా’’ అని అన్నారు.