Cyber Crime: అన్నపూర్ణ స్టూడియో సంస్థనూ వదల్లేదు!

ABN , Publish Date - Jul 29 , 2024 | 08:59 PM

తమ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరుపై కొత్త నటీనటుల ఎంపిక అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అన్నపూర్ణ స్టూడియోస్‌ (Annapurna Studios) సంస్థ కోరింది.

తమ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరుపై కొత్త నటీనటుల ఎంపిక అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అన్నపూర్ణ స్టూడియోస్‌ (Annapurna Studios) సంస్థ కోరింది. ఇలాంటి వాటి బారిన పడవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం, డబ్బులు పంపడం చేయొద్దని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. అగ్ర నిర్మాణ సంస్థల పేరు చెప్పి, అవకాశాలు ఇప్పిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు (Fake Calls) అమాయకులకు వల వేస్తున్నారు. అది నిజమేనని మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ సంస్థ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఫేక్‌ ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏ సమాచారమైనా అఫీషియల్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌, వెబ్‌సైట్‌ ద్వారానే పంచుకుంటామని తెలిపింది.

Annapurna.jpg 1.jfif

ఈ మధ్యనే ఇలాంటి సమస్యను మరో చిత్ర నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ కూడా ఎదుర్కొంది. ‘‘మా నిర్మాణ సంస్థకు సంబంధం లేని ఫేక్‌ ఈ-మెయిల్‌ ---- పేరుతో పలువురు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. మా కంపెనీ అధికారిక ఈ-మెయిల్‌ కాకుండా వచ్చే ఏ సమాచారాన్ని నమ్మొద్దు. ఫేక్‌ ఈ-మెయిల్‌ ఐడీలతో అసత్య సమాచారాన్ని పంపిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, కన్నప్ప ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌ కుమార్‌ సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేయనున్నారు.  

Updated Date - Jul 29 , 2024 | 08:59 PM