Game Changer: అంజలితో సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌.. అదేంటో తెలుసా..

ABN , Publish Date - Dec 30 , 2024 | 08:35 AM

సంక్రాంతి కానుకగా జనవరి 10న రామ్‌చరణ్‌, అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంతో రాబోతుంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌ తరవాత రామ్‌ చరణ్‌ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.



సంక్రాంతి కానుకగా జనవరి 10న రామ్‌చరణ్‌(Ram Charan), అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రంతో రాబోతుంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌ తరవాత రామ్‌ చరణ్‌ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. 'భారతీయుడు 2' తరవాత శంకర్‌ నుంచి వస్తున్న సినిమా ఇది. శంకర్‌ సినిమా అంటేనే భారీతనం, అంతకు మించి అంచనాలు ఉంటాయి. అయితే 'భారతీయుడు-2' పరాజయం తర్వాత అంచనాలతో పాటు అనుమానాలు పెరిగాయి. మరి శంకర్‌ ఈ సారైనా  మెప్పిస్తాడా అన్నది చూడాలి. అతని రేంజ్‌ సినిమాను ఇవ్వగలడా? అని ఫ్యాన్స్‌ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన పాటలు టీజర్‌తో తసినిమాపై నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమాపై పాజిటివ్‌ టాక్‌ నడుస్తోంది. సినిమా ఫస్టాఫ్‌ ఇలా ఉంది..  అలా ఉంది అంటూ లీకులు బయటకు వస్తున్నాయి.  దాందో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Anju.jpg

ముఖ్యంగా చరణ్‌ - కియారా అడ్వాణీ (Kiara Adwani) లవ్‌ స్టోరీ చాలా కొత్తగా డిజైన్‌ చేశారని తెలుస్తోంది. కాలేజీ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చే సీన్లు అలరించబోతున్నాయని, ఇంట్రవెల్‌ కార్డు మంచి హై ఇస్తుందని తెలిసింది. క్లైమాక్స్‌ అయితే.. శంకర్‌ మార్క్‌లో సాగే ఓ ఫీల్‌తో ధియేటర్ల నుంచి బయటకు పంపిస్తారని టాక్‌ నడుస్తోంది. శంకర్‌ ప్రతి సినిమాలోనూ ఫ్లాష్‌ బ్యాక్‌ అనేది బలంగా ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా.. ఫ్లాష్‌బ్యాక్‌తో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టేస్తాడనే నమ్మకం ఉంది. అందుకు ఆయన దర్శకత్వం వచ్చిన గత చిత్రాలే నిదర్శనం. ఈ సినిమాకు కూడా ఫ్లాష్‌బ్యాక్‌ చాలా కీలకం కానుందట. ఇక  సినిమా పేరు చెప్పగానే రామ్‌చరణ్‌ తర్వాత గుర్తొచ్చే పేరు ఎస్‌.జె.సూర్య. ఈ సినిమాలో సూర్య విలన్‌ గా కనిపించబోతున్నాడు. విలన్‌ గా సూర్య పాత్ర ఎలా ఉండబోతోందన్న విషయం ఇప్పటి వరకూ దాచి పెట్టింది చిత్రబృందం. ఆ క్యారెక్టర్‌ ఎంత పేలితే అంత పే ఆఫ్‌ అవుతుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ ఉందట. అదే తెలుగమ్మాయి. అంజలి పాత్ర అట. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఈ క్యారెక్టర్‌ని శంకర్‌ చాలా బలంగా తీర్చిదిద్దారని అంజలి (Anjali) తన నటనతో, స్క్రీన్  ప్రెజెన్‌ తో మెప్పిస్తుందని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన పాటలు బాగానే అలరించాయి. అయితే.. ఓ మాస్‌ పాట బయటకు రావాల్సివుంది. ఆ పాటలో చరణ్‌ స్టెప్పులు మరో రేంజ్‌ లో ఉండబోతున్నాయట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వచ్చిన లీకులు ఇవి. శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు భారీగా నిర్మించిన చిత్రమిది. 

Updated Date - Dec 30 , 2024 | 08:46 AM