అంజలి హర్రర్ సినిమా విడుదల తేదీ మారింది, కారణం ఇదే...

ABN , Publish Date - Feb 28 , 2024 | 10:21 AM

అంజలి ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ కామెడీ సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా మార్చి 22న విడుదలకావాల్సి వుంది, కానీ ఇప్పుడు చిత్ర నిర్వాహకులు ఈ సినిమా విడుదలతేదీని మార్చారు, ఎందుకంటే...

అంజలి హర్రర్ సినిమా విడుదల తేదీ మారింది, కారణం ఇదే...
A still from Geethanjali Malli Vachindi

టాలెంటెడ్ నటి అయిన అంజలి 'గీతాంజలి' అనే సినిమాతో తానొక వైవిధ్యమైన పాత్రలు పోషించి సోలోగా సినిమాని తన భుజాలపై తీసుకెళ్లగలను అని నిరూపించింది. ఆ హర్రర్ కామెడీ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న సినిమా 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. ఇందులో అంజలి ప్రాధాన పాత్ర పోషించడం ఆసక్తికరం. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ ఈ సినిమాని ఎంవివి తో కలిపి నిర్మించారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' నటి అంజలికి 50వ సినిమా కావటం, దీంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకంగా చిత్రంగా మారింది.

ఈ సినిమా కూడా మొదటి సినిమా వున్నట్టే హారర్-కామెడీ జానర్‌లో ఉంటుందని చిత్ర నిర్వాహకులు ఇంతకు ముందే చెప్పారు. ఈ చిత్ర ప్రచార వీడియోలు ఇప్పటికీ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో కాకుండా ఇతర భాషల్లో కూడా మార్చి 22న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఆ తేదీకి చాలా చిత్రాలు వస్తున్నాయి. అన్ని సినిమాలకు తగిన ప్రాధాన్యం లభించాలనే ఉద్దేశంతో 'గీతాంజలి మళ్లీ వచ్చింది' విడుదల వాయిదా వేశారు.

geethanjalidance.jpg

ఈ మేరకు ఈ చిత్ర నిర్వాహకులు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాను ఇప్పుడు ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సీక్వెల్ హారర్-కామెడీ జోనర్‌లోని అన్ని చిత్రాలను అధిగమిస్తుందని, రికార్డుల్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని టీమ్ నమ్మకంగా ఉంది. ‘గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి సీక్వెల్ ప్రారంభం కానుంది. ఈ సీక్వెల్‌లో అంజలితో పాటు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'నిన్ను కోరి', 'నిశ్శబ్దం' చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అట్లాంటా (యుఎస్)కి చెందిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా, సుజాత సిద్దార్థ్ కెమెరామెన్‌గా పని చేశారు. కోన వెంకట్ కథ రాశారు. ఈ చిత్రాన్ని ఎంవివి సత్యనారాయణ, జీవీ నిర్మించారు.

Updated Date - Feb 28 , 2024 | 10:29 AM