Yevam: ఈ సినిమాలో.. నెక్స్ట్ ఏంటనేది ఎవరూ అంచనా వేయలేరు
ABN , Publish Date - Jun 07 , 2024 | 08:24 AM
హీరోయిన్ చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్, ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం యేవమ్. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన లుక్స్, గ్లిమ్స్, టీజర్ ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.
హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary), వశిష్ట సింహా (Vasishta N Simha), భరత్‌రాజ్ (Jai Bharat Raj), ఆషు రెడ్డి (Ashu Reddy) ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్ (Yevam Movie). ప్రకాష్ దంతులూరి (Prakash Dantuluri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్ (Navdeep), పవన్ గోపరాజు (Pavan Kishore) నిర్మాతలు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన లుక్స్, గ్లిమ్స్, టీజర్ ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా.. చాందిని చౌదరి (Chandini Chowdary) మాట్లాడుతూ: ముందుగా మీడియా కి థాంక్స్, ట్రైలర్ చూపించగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) గారు చాలా excite అయ్యి లాంచ్ చేసినందుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ‘యేవమ్’ (Yevam Movie)అనేది మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా. జూన్ 14న రిలీజ్ అవుతుంది. నేను మొదటి సారి పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను, సైకలాజికల్ ఎమోషన్స్ చాలా ఉంటాయి. ఏ సినిమా అయినా ప్రేక్షకులు చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ ప్రీడిక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో వాళ్ళు ఏం అనుకున్నా దానికి పూర్తి బిన్నంగా అవుతుంది. అవ్వన్నీ ప్రేక్షకులకి చాలా హై ఇస్తాయి, కథ వికారాబాద్ లో జరుగుతుంది, తెలంగాణ కల్చర్ కి సంబంధించిన ఎలెమెంట్స్ కూడా ఉంటాయి అన్నారు.
డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి (Prakash Dantuluri) మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి క్యారెక్టర్ పోస్టర్స్ ని రిలీజ్ చేశాం, ప్రతి క్యారెక్టర్ కి ఒక్కో ట్యాగ్ లైన్ క్యారెక్టర్ కి సరిపడా ఇచ్చాం, ఈ 4 విభిన్నమైన క్యారెక్టర్స్ , వారి వ్యక్తిత్వాలు ఒక అనుకోని పరిస్థితిలో కలుసుకుని అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడితే ఎమవుతుంది అనే థ్రిల్లింగ్ పాయింట్ తో నడిచే కథ. నర్రేషన్ చాలా యునిక్ గా ఉంటుంది. చాలా మంది అడిగారు ఈ కథ పేరు ‘యేవమ్’ అంటే ఏంటి? ఇది తెలుగా? హిందీ ఆ? సంస్కృతమా అని. ‘యేవమ్’ (Yevam Movie) అంటే “ఇది ఇలాజరిగింది” అని. ఈ నాలుగు క్యారెక్టర్స్ జర్నీ లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ఏది మంచి ఏదో చెడు? ఎవరు మంచి ఎవరు చెడ్డ? అనే విషయాన్ని మేము క్లైమాక్స్ లో రివీల్ అవుతుందని అన్నారు. జూన్ 14న సినిమా రిలీజ్ అవుతుందన్నారు.
హీరో భరత్ రాజ్ (Jai Bharat Raj) మాట్లాడుతూ.. నేను అభిరామ్ అనే పాత్ర పోషించానని. మా ట్రైలర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి చాలా థాంక్స్. మాది థ్రిల్లర్ కాబట్టి ఏ చిన్న విషయం బయటకి చెప్పినా కథ తెలిసే ఛాన్స్ ఉంది, అందుకని నేను ఏం చెప్పలేను ఇప్పుడు. కానీ చాలా ఈ థ్రిల్లర్ లో చాలా హై వస్తుంది, ఇంటెలిజెంట్ గా ఉంటుంది, మా పాత్రలతో మీరు తెలియకుండా ఇంటరాక్ట్ అవుతారు. అఅన్నారు.