Highcourt: దేవరకి బిగ్ షాక్.. టికెట్ ధరలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 25 , 2024 | 01:32 PM
దేవర సినిమాకు గట్టి షాక్ తగిలింది. టికెట్ ధరలు పెంచడాన్ని 10 రోజులకే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దేవర(Devara) టికెట్ల ధరల విషయంలో ఏపీ ఉన్నత న్యాయస్థానం(High court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నమోదైన పిల్‌పై సానుకూలంగా స్పందించి ‘దేవర’ మేకర్స్‌కి షాక్ నిచ్చింది.
భారీ బడ్జెట్ మూవీ కావడంతో కొన్ని రోజుల క్రితం ‘దేవర’ టికెట్ల ధరలను 14 రోజుల పాటు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మేకర్స్, జూనియర్ ఎన్టీయార్‌తో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల ఈ జీవో(G.O)ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీన్ని విచారించిన న్యాయస్థానం పిటిషినర్లతో ఏకీభవించింది. పద్నాలుగు రోజుల పాటు టికెట్స్ ధరలని పెంచుకోవచ్చు అన్న ప్రభుత్వ ఆదేశాలను సవరిస్తూ.. 10 రోజులకు కుదించింది. దీంతో ఇది సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.