Anasuya: రష్మికని టార్గెట్ చేసిన అనసూయ.. ‘దూరపు కొండలు నునుపు'
ABN , Publish Date - Dec 04 , 2024 | 07:19 PM
విజయ్ దేవరకొండ, అనసూయ వివాదం ఇప్పుడిప్పుడే సమసిపోయేలా కనిపించడం లేదు. ఇంతకీ ఏమైందంటే..
యాంకర్, యాక్టర్, హోస్ట్ అనసూయ భరద్వాజ్.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. ఆమె అనేకసార్లు ప్రత్యేక్షంగా, పరోక్షంగా హీరో విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె మరోసారి విజయ్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఏం చేశారంటే..
2017లో రిలీజైన అర్జున్ రెడ్డి సినిమాలోని ఓ డైలాగ్ గురించి అనసూయ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీంతో విజయ్ ఫ్యాన్స్ అనసూయని దారుణంగా ట్రోల్ చేశారు. అప్పటినుండి ఆమె విజయ్ ఫ్యాన్స్ ని, విజయ్ ని టార్గెట్ చేస్తూ పలు పోస్టులు పెట్టారు. తాజాగా తన ట్విట్టర్ ఖాతా నుండి 'దూరపు కొండలు నునుపు' అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో పరోక్షంగా విజయ్ నే ఆమె టార్గెట్ చేసిందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే..
ఇటీవల అనసూయ 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో రష్మిక మందన్న స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అనే స్పీచ్ విజయ్ దేవరకొండ హావభావాలకు మ్యాచ్ అయ్యేవిధంగా ఉన్నాయి. అయితే విజయ్, రష్మిక డేట్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంపై పరోక్షంగా వీరిద్దరూ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక అనసూయ పరోక్షంగా విజయ్ ని టార్గట్ చేస్తూ కర్ణాటక లాంటి దూరపు ప్రాంతాల నుండి వచ్చిన రష్మికను మెన్షన్ చేసిందని, అలాగే కొండలు నునుపులో దేవరకొండ ఇంటిపేరు వచ్చేలా ప్రస్తావించిందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇంతకీ అనసూయ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేసిందో ఆమెకే తెలియాలి.