Anand Sai: కళ్యాణ్ ఆలోచనలు, అభిరుచి మేరకు మార్పులు చేశాం!
ABN , Publish Date - Jul 20 , 2024 | 03:19 PM
పవన్ కల్యాణ్(Pawan kalyan) ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి (Anand Sai) మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే! తొలిప్రేమ చిత్రం నుంచి నేటి దాకా వీరిద్దరు అదే స్నేహంతో కొనసాగుతున్నారు.
పవన్ కల్యాణ్(Pawan kalyan) ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి (Anand Sai) మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే! తొలిప్రేమ చిత్రం నుంచి నేటి దాకా వీరిద్దరు అదే స్నేహంతో కొనసాగుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం (Ap Deputy Cm) పవన్ కల్యాణ్ ఆఫీస్‌ను ఆనంద్ సాయి ఇటీవల రీ మోడలింగ్ చేశారు. కల్యాణ్ చాలా సాదాసీదాగా ఉండడాన్ని ఇష్టపడతారని ఆయన తెలిపారు. పవన్ ఆలోచనలు, అభిరుచి మేరకు ఆఫీసు నిర్మాణం చేసినట్లు చెప్పారు. ఆయనకు నచ్చిన రంగులను ఆఫీస్‌లో వేసినట్లు తెలిపారు. ఇంగ్లీష్ మీడియాతో ఆనంద్ సాయి మాట్లాడుతూ పవన్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేశారు." ప్రజలకు అనుకూలంగా ఉండడం కోసం చాలా సింపుల్‌గా క్యాంపు కార్యాలయం డిజైన్ చేశాం. పవన్ కల్యాణ్ ముదురు రంగుల కంటే తెలుపు రంగును ఇష్టపడతారు. అందుకే ఆయన ఆఫీసుకు అన్ని లైట్ కలర్స్ వేశాం. ఆయన తన గదిని ప్రజలకు అనుకూలంగా ఉండాలన్నారు. అందుకే ఫర్నీచర్‌ను ఫ్యాబ్రిక్‌తో చేశాం. పవన్ పెద్ద స్టార్ అయినప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడతారు. ఇంత భారీ మెజారిటీతో గెలిచినా ఆయనలో కొంచెం కూడా గర్వం లేదు. నేను మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ‘తొలిప్రేమ’ సినిమా సమయంలో మొదటిసారి ఆయన్ని కలిశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే వినయంగా ఉన్నారు’ అని అన్నారు.
ఇకతో తనతో మైత్రి గురించి చెబుతూ ‘‘ఖుషి’, ‘తమ్ముడు’ నుంచి రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వరకు నేను ఆయన సినిమాల కోసం పనిచేశాను. ఆయనతో పని అంటే స్వేచ్ఛగానూ, సులభంగానూ ఉంటుంది. నా శ్రేయోభిలాషుల్లో పవన్ ఒకరు. రెండు దశాబ్దాలుగా మా ేస్నహం కొనసాగుతోంది’ అని చెప్పారు.