Anr Awards: చిరంజీవికి ‘Anr జాతీయ అవార్డు’.. ప్రదానం చేసిన అమితాబ్ బచ్చన్
ABN , Publish Date - Oct 28 , 2024 | 07:25 PM
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్‌ఆర్ అవార్డు’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు అమితాబ్ బచ్చన్ చిరంజీవికి ‘Anr జాతీయ అవార్డు’ప్రధానం చేసి సత్కరించారు.
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్‌ఆర్ అవార్డు’ (ANR National Award 2024)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు ప్రధానోత్సవ వేడుక ఈ రోజు (సోమవారం) రోజున అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ముఖ్య అతిథిగా హజరై చిరంజీవికి అవార్డు ప్రధానం చేశారు. టాలీవుడ్ తారాలోకమంతా ఈ వేడుకకు తరలివచ్చారు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య (Naga Chaitanya), అఖిల్ దగ్గరుండి అతిథులను ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కీరవాణి సారథ్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అక్కినేని నాగేశ్వర రావు చివరగా మట్లాడిన మాటలను, అంతిమ యాత్రలను ప్లే చేయగా అక్కడికి వచ్చిన అతిథులందరి చేత కంటతడి పెట్టించాయి. ఆపై నాగార్జున, అమితాబ్, చిరంజీవి మట్లాడుతూ అక్కినేని సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్, వెంకటేశ్, రామ్ చరణ్, నాని, శ్రీలీల, సిద్దు జొన్నలగడ్డ, సుధీర్ బాబు, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు,బోయపాటి శ్రీనివాస్, నాగ్ ఆశ్విన్, విజయేంద్ర ప్రసాద్, శోభిత దూళిపాళ్ల, మురళీమోహన్, కె.ఎస్ రామారావు, బ్రహ్మానందం, అశ్వినీదత్, కీరవాణి దంపతులు, ఆది శేషగిరి రావు, మహా నటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, వరప్రసాద్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, నందమూరి రామకృష్ణ, ప్రకాష్ రాజ్, వైవిఎస్ చౌదరి, అక్కినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.