Amaran: క్యాస్ట్‌పై క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్.. అందుకే చూపించలేదు

ABN , Publish Date - Nov 06 , 2024 | 02:28 PM

దీపావళి కానుకగా రిలీజైన 'అమరన్' సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి మతాన్ని క్లియర్‌గా చూపెట్టిన డైరెక్టర్.. కనీసం హీరో క్యాస్ట్ కూడా మెన్షన్ చేయలేదని పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

అమరన్.. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఒక వైపు 'లక్కీ భాస్కర్', 'క' వంటి బ్లాక్‌బస్టర్ స్ట్రెయిట్ సినిమాల నుండి పోటీని తట్టుకొని మరి ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమాకి మేజర్ హైలెట్‌గా సాయి పల్లవి నటన నిలవగా శివ కార్తికేయన్ యాక్షన్, ఎమోషన్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి మతాన్ని క్లియర్‌గా చూపెట్టిన డైరెక్టర్.. కనీసం హీరో క్యాస్ట్ కూడా మెన్షన్ చేయలేదని పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..


ఈ సినిమాలో సాయి పల్లవి పోషించిన 'ఇందూ' పాత్రను క్రిస్టియన్‌గా చూపించారు. ఆమె ఆచార వ్యవహారాలు కూడా చర్చికి వెళ్లడం, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా క్రిస్టియన్ అన్నట్లుగానే చూపించారు. అయితే సినిమాలో ఇందూ పెళ్లి మేజర్ ముకుంద్‌తో హిందూ సంప్రదాయంలోనే గుడిలో జరుగుతుంది. కాగా సినిమాలో హీరో కాస్ట్ మెన్షన్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే పలువురు ఈ సందేహాన్ని డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దగ్గరికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన క్లారిటీ ఇస్తూ.. " మేజర్ తల్లితండ్రులు అసలు కుల ప్రస్తావనే వద్దన్నారు. అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కొడుకు ఒక ఇండియన్, తమిళుడిగానే ప్రజలు గుర్తించాలి తప్పించి కులం ఆధారంగా కాదని" సెన్సిబుల్ గా హ్యాండిల్ చేశాడు.


ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 2014లో క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల‌ను ఎదురించి వీర‌మ‌ర‌ణం పొందిన త‌మిళ‌నాడుకు చెందిన ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ బ‌యోగ్ర‌ఫీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో ముకుంద్‌గా శివ కార్తికేయ‌న్‌, ముకుంద్ భార్య ఇందు రెబెకా వ‌ర్గీస్‌గా సాయి ప‌ల్ల‌వి న‌టించింది. ఐదేండ్ల ప్రాయంలోనే మిల‌ట‌రీ మార్చ్‌ను చూసి ఎప్ప‌టికైనా ఆర్మీలో చేరాల‌ని ముకుంద్ లక్ష్యంగా పెట్టుకుని, త‌న గ్రాడ్యుయేష‌న్ టైం నుంచి అందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అదే స‌మ‌యంలో త‌ను డిగ్రీ చ‌దువుతున్న‌ కాలేజీలోకి కొత్త‌గా మ‌ల‌యాళీ అయిన ఇందు రెబెకా వ‌ర్గీస్‌ చేర‌డం, వారి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం జ‌రిగిపోతాయి. ఆ పై ఆర్మీలో చేరిన ముకుంద్ ఇందును పెళ్లి చేసుకోవ‌డానికి వ‌చ్చిన ఇష్యూ, ఆర్మీలో కెప్టెన్‌గా, క‌మాండ‌ర్‌గా, మేజ‌ర్‌గా ఎద‌గ‌డం.. రాష్ట్రీయ రైఫిల్స్‌కి డిప్యుటేష‌న్‌పై రావడం జరుగుతుంది. ఈక్ర‌మంలో ఇద్ద‌రు మోస్ట్ వాంటెడ్ తీవ్ర‌వాదుల‌ను అంత‌మొందించి ఎలా అమ‌రుడ‌య్యాడ‌నే నేప‌థ్యంలో సినిమా క‌థ‌ న‌డుస్తుంది.

Updated Date - Nov 06 , 2024 | 02:28 PM