Allu Sirish: మా నాన్న కూడా.. నా సినిమాకు ఇంత ఖర్చు పెట్టలేదు

ABN , Publish Date - Jun 26 , 2024 | 12:40 PM

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బడ్డీ. ఈ సినిమా జూలై 26న థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈక్ర‌మంలో తాజాగా హైదరాబాద్‌లో సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Allu Sirish: మా నాన్న కూడా.. నా సినిమాకు ఇంత ఖర్చు పెట్టలేదు
buddy

అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బడ్డీ (Buddy). గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj ), ప్రిషా రాజేశ్ సింగ్ (Prisha Singh) హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ (Studio Green) ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా (Gnanavelraja Ke), అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ (Sam Anton) దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 26న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈక్ర‌మంలో తాజాగా సినిమా హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

GQ6nJa2bwAENzCC.jpeg

ఈ కార్యక్రమంలో దర్శకుడు శామ్ ఆంటోన్ (Sam Anton) మాట్లాడుతూ.. జ్ఞానవేల్ రాజా గారి ప్రొడక్షన్ లో డార్లింగ్ మూవీ చేశాను. అది నా మొదటి సినిమా. ఫస్ట్ మూవీ నుంచే నాపై జ్ఞానవేల్ రాజా గారికి నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం డిస్కషన్ జరిగినప్పుడు నన్ను స్క్రిప్ట్ కూడా అడగలేదు. కేవలం నా మీద నమ్మకంతో ఈ మూవీ ఇచ్చారు. సీజీ అయ్యాక ఫైనల్ వెర్షన్ సినిమా చూశారు. జ్ఞానవేల్ గారికి బడ్డీ (Buddy) సినిమా నచ్చింది. ఆయన తర్వాత నా మీద నమ్మకం ఉంచిన మరో పర్సన్ శిరీష్. నేను డైరెక్టర్ రాజమౌళి గారి ఫ్యాన్ ఆయన చేసిన ఈగ సినిమా ఈ బడ్డీ మూవీకి ఇన్సిపిరేషన్. బడ్డీకి సీజీ వర్క్ చేసినప్పుడు ఈగ మూవీతో పోల్చి సజేషన్స్ చెప్పేవాడిని. బడ్డీ మూవీకి వర్క్ చేసిన అజ్మల్, అలీ, హీరోయిన్స్, ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ అన్నారు.


GQ8EGaxXUAIo3W8.jpeg

హీరో అల్లు శిరీష్ (Allu Sirish) మాట్లాడుతూ.. లాస్ట్ ఇయర్ బడ్డీ పోస్టర్ రిలీజైనప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా.. ఓటీటీలో ఇలాంటి సినిమా ఉందని చెప్పారు. నేను వారికి ఎన్ని చెప్పినా అనేది అనుకుంటారు అని వదిలేశా. బడ్డీ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. టెడ్డీ బేర్‌తో అడ్వెంచర్ యాక్షన్ మూవీ, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనుకున్నా. కానీ ఇవాళ బడ్డీ (Buddy) ట్రైలర్ చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కొత్త తరహా సినిమా ఎప్పుడు వచ్చినా మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది.

GQ8EHBDWYAAnPl5.jpeg

శామ్ (SamAnton) ‘100’ అనే సినిమా చూసి చాలా బాగా చేశాడనుకున్నా.. అలాగే ఆయన చేసిన ట్రిగ్గర్ చిత్రం ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను. రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న అథర్వాతో యాక్షన్ మూవీ చేశాడేంటి అనుకుని శామ్ కు ఫోన్ చేసి మాట్లాడాను. మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు సినిమా చేద్దామని అన్నా. బడ్డీ (Buddy)తో మా కాంబో కుదిరింది. ఈ సినిమాలో హీరో నేను కాదు టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్ కు ఇంప్రెస్ అయ్యే నేనీ సినిమా చేశా.. నా హీరోయిజం చూపించాలని కాదు. జ్ఞానవేల్ గారికి థ్యాంక్స్. మా నాన్న కూడా నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయలేదు. నాతో భారీ ఖర్చుతో బిగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేశారు జ్ఞానవేల్. పుష్ప 2 గురించి నేను ఇప్పుడు మాట్లాడను. మాట్లాడితే మరింత హైప్ క్రియేట్ చేస్తారు. టీజర్, ట్రైలర్ చూసి మీరే డిసైడ్ చేసుకోవాలని అన్నారు.

Updated Date - Jun 26 , 2024 | 12:41 PM