Sandhya Theatre Stampede: కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌తో అల్లు అర్జున్ మామ భేటీ..
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:12 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదంలో రోజుకో ఎపిసోడ్ ఉత్కంఠను రేపుతోంది. తాజాగా అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ ఇన్‌చార్జ్ దీప దాస్ మున్షీని కలవడం ఆసక్తికరంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో హీటేక్కిస్తున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదంలో రోజుకో ఎపిసోడ్ ఉత్కంఠను రేపుతోంది. ఈ ఇష్యుపై తెలంగాణ ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీ అన్నట్లుగా మారింది వ్యవహారం. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ ఇన్‌చార్జ్ దీప దాస్ మున్షీ ని కలవడం ఆసక్తికరంగా మారింది.
ఈరోజు హైదరాబాద్ కి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ దీప దాస్ మున్షీ వచ్చారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలతో మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆమెని కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ కేసుపై వ్యవహరిస్తున్న తీరు సంచలనంగా మారిన వేళా ఈ మీటింగ్ ఆసక్తిని రేపుతోంది.
మరోవైపు కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మేమందరం ప్రెస్ మీట్ లో ఉండంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు గాంధీభవన్ వచ్చారు. ఆయన బయటకు వెళ్లిపోయాక నాతో ఫోన్ మాట్లాడారు. మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నా పాత మిత్రుడు, కాంగ్రెస్ వాది. చంద్ర శేఖర్ రెడ్డితో తప్పకుండా మాట్లాడుతా. ఏదైనా విషయాలు ఉంటే చర్చించుకుంటాం. అల్లు అర్జున్ అంశంలో ఒక నిండు ప్రాణం పోయింది. మరొక ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. A 11 గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆయనకు బెయిల్ వచ్చింది. దీనిపై రాజకీయ లబ్ధి పొందేందుకు చిత్ర సీమ చరిత్ర తెలియనివాళ్లు మాట్లాడుతున్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న కిషన్ రెడ్డి, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీకు తెలీదా? BRS వాళ్లు కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. చిత్రసీమకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం వీళ్లకు తెలుసా? చిత్ర సీమ హైదరాబాద్ ఎలా వచ్చిందో వీళ్ళకు తెలుసా? పుష్ప 2కి కూడా వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వమే. రాజకీయ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని' హితవు పలికారు.