Allu Arjun's Statement: బన్నీ స్టేట్మెంట్ ఇదే..
ABN , Publish Date - Dec 13 , 2024 | 02:36 PM
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ అయినా బన్నీ నుండి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..
అల్లు అర్జున్ పోలీసుల విచారణలో..' సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదు. నేను రావడంతోటే ఈ సంఘటన జరిగిందనేది అవాస్తవం. సినిమా విడుదల సందర్భంగా థియేటర్ రావడం సహజమే. ఇలాంటి సంఘటన జరుగుతుందని నేను ఊహించలేదు. గతంలో కూడా నేను ఎన్నో సినిమాలకు రిలీజ్ సమయంలో వెళ్లాను. ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. గతంలో లాగే పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం సంధ్య థియేటర్ వద్దకు వెళ్లాను. ఈ సంఘటన జరిగినట్లు చాలాసేపటికి నా వ్యక్తిగత సిబ్బంది నుంచి తెలుసుకున్నాను. నాకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు' అంటూ పేర్కొన్నారు.