Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు జైలా? బెయిలా?
ABN , Publish Date - Dec 13 , 2024 | 03:15 PM
‘పుష్ప’ సిరీస్ చిత్రాల హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్‌పై నమోదు చేసిన కేసులన్నీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుండటంతో ఆయన బెయిల్ వస్తుందా? లేదంటే జైలు తప్పదా? అనేలా టాక్ మొదలైంది.
‘పుష్ప’ సిరీస్ చిత్రాల హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ‘పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం డిసెంబర్ 4 రాత్రి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె భర్త థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ మరియు ఆయన సిబ్బందిపై కేసు పెట్టారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనపై 105, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆయనపై నమోదు చేసిన కేసులన్నీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. ఈ కేసు కింద సదరు వ్యక్తికి ఐదు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్షపడే అవకాశం ఉంది.
Also Read-Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్
ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనపై నమోదైన కేసులన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో అల్లు అర్జున్‌కి బెయిల్ వస్తుందా? రాదా? లేదంటే.. జైలు శిక్ష తప్పదా? అనేలా హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. కాగా, కాసేపట్లో నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు హాజరుపరచనున్నారని తెలియడంతో.. నాంపల్లి కోర్టు వద్దకు అల్లు అర్జున్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించినట్లుగా సమాచారం.