Allu Arjun: నంద్యాల వాటర్ వంటపట్టిందా.. సుకుమార్ పేరు కూడా తెలియదా
ABN , Publish Date - Dec 12 , 2024 | 07:46 PM
అల్లు అర్జున్ తీరుపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్‌తో ఆయన మాటల్లో ప్రభావం కనిపిస్తుందని.. ఇప్పటికైనా మార్పు చెందకపోతే అధోగతే అని హెచ్చరిస్తున్నారు..
పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్‌కి అసలు ఏమైంది. మాటల్లో తడబాటు, చేతల్లో తొందరపాటు కనిపిస్తుందంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటారా? ప్రస్తుతం ఆయన 'పుష్ప 2' సక్సెస్‌ని ఆస్వాదిస్తూ సక్సెస్ మీట్‌లలో పాల్గొంటున్నాడు. అయితే ఆయన స్పీచ్‌లలో తడబాటు వెనుక దేని ప్రభావం ఉందనే చర్చ తెరపైకి వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
2021, 2024లలో రిలీజైన 'పుష్ప', 'పుష్ప 2' రెండు సినిమాలు ఇంటి పేరు నేపథ్యంతోనే తెరకెక్కాయి. ఇంటి పేరు కాన్సెప్ట్‌తో తీసిన సినిమాలతో హిట్ అందుకున్న బన్నీ.. ఆ సినిమా దర్శకుడి ఇంటి పేరే మర్చిపోవడం గమనార్హం. తాజాగా ఢిల్లీలో జరిగిన పుష్ప 2 సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ పేరుని బండి సుకుమార్ రెడ్డిగా ప్రస్తావించారు. వాస్తవానికి సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డి సుకుమార్. ఏకంగా అల్ల్లు అర్జున్ ఆయన కమ్యూనిటీనే చేంజ్ చేశారు. దీంతో బన్నీకి నంద్యాల వాటర్ బాగా వంటబట్టినట్లుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ టైమ్‌లో వైసీపీ పార్టీ అందుకేనా నీకు సపోర్ట్ చేసిందంటూ మరికొందరు వంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
బ్రాండు, బ్రాండు అని సినిమాలో చించేసుకున్న బన్నీ.. బయట మాత్రం బ్రాండ్ పేర్లు మార్చేస్తున్నారు అంటూ వైల్డ్ ఫైర్‌పై ఫైర్ అవుతున్నారు. మొన్న తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సక్సెస్ మీట్‌లలోను బన్నీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ పేరు మర్చిపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఇంటిపేరును మర్చిపోయారు. సినిమా సక్సెస్‌తో పేర్లు మర్చిపోవడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. భారీ సక్సెస్ అందుకున్న బన్నీ ట్రోల్ మెటీరియల్‌గా మారటం బాధాకరమని పలువురు తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక నుంచైనా చేతల్లో, మాటల్లో మార్పు వస్తే బాక్సాఫీస్ సిండికేట్‌కి రాజుగా కొనసాగే అవకాశాలు ఎక్కడికి పోలేదని సూచిస్తున్నారు.