Allu Arjun: పోలీసులను నిలబెట్టి. కాపీ తాగి.. ముద్దు పెట్టి..
ABN , Publish Date - Dec 13 , 2024 | 07:00 PM
బన్నీ మాత్రం మోహరించిన పోలీస్‌లను అలాగే నిలబెట్టి.. దర్జాగా కాఫీ తాగుతూ.. తండ్రితో మాట్లాడుతూ.. తదుపరి బాధపడుతున్న భార్యకు ధైర్యం చెప్పి... ఆమెను ముద్దాడారు.
'పుష్ప - 2' (Pushpa 2) విడుదల రోజు సంధ్య థియేటర్ (Sandhya Theatre) దగ్గర జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే! ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులు అల్లు అర్జున్ (Allu Arjun) ఇంటికి చేరుకుని విచారణకు సహకరించాలని కోరారు. ముందుగా అరెస్ట్ విషయాన్ని బయటపెట్టలేదు. కనీసం డ్రస్ మార్చుకునే టైమ్ కూడా ఇవ్వకుండా పోలీస్ వెహికల్ ఎక్కాలన్నారు. కానీ బన్నీ మాత్రం మోహరించిన పోలీస్‌లను అలాగే నిలబెట్టి.. దర్జాగా కాఫీ తాగుతూ.. తండ్రితో మాట్లాడుతూ.. తదుపరి బాధపడుతున్న భార్యకు ధైర్యం చెప్పి... ఆమెను ముద్దాడారు. పోలీస్‌లు తన ఇంటి ప్రాంగణంలో ఉన్నంత సేపు అల్లు అర్జున్ హుందాతనంలో ఎక్కడా తగ్గలేదు. పోలీసులను నిలబెట్టి కాఫీ తాగుతూ వారితో మాట్లాడారు. అది పూర్తయ్యాక ఓ 10-15 నిమిషాలకు పోలీసుల కారు ఎక్కారు. ఈ విజువల్ చూసిన నెటిజన్లు, అభిమానులు "సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ పుష్పరాజ్ పోలీసుల ముందు తగ్గలేదు"అని కామెంట్స్ చేస్తున్నారు.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన బన్నీని తదుపరి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడ వాదనల తర్వాత ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు.
దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది.