Pushpa 2 X Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ‘ఎక్స్’ రివ్యూస్ ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Dec 05 , 2024 | 07:36 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ జాతర మొదలైంది. ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై అప్పుడే ట్విట్టర్ ఎక్స్‌లో రివ్యూస్ పోస్ట్ అవుతున్నాయి. డిసెంబర్ 4 రాత్రి నుండే థియేటర్లలో సందడి చేయడం మొదలెట్టిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమాపై ట్విట్టర్ రివ్యూస్ ఎలా ఉన్నాయంటే..

Pushpa 2 Movie Still

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా జంటగా.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం నేడు (డిసెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అధికారికంగా డిసెంబర్ 5 రిలీజ్ అయినప్పటికీ డిసెంబర్ 4 రాత్రి నుంచే ఈ సినిమా ప్రీమియర్స్ అన్ని చోట్ల ప్రదర్శితమయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో.. ఇప్పటికే ఈ సినిమా చూసిన వారంతా సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. ఒకటీ ఆరా తప్పితే.. ఈ సినిమాపై అంతా పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా టిక్కెట్ కొనుక్కుని లోపలికి వెళ్లిన ప్రేక్షకుడికి సినిమాలోని జాతర ఎపిసోడ్ ఒక్కటి చాటు.. ఆ డబ్బులకి వర్త్ అనే శాటిస్‌ఫ్యాక్షన్ ఈ మూవీ ఇస్తుందనేలా టాక్ అయితే వినబడుతోంది. కాకపోతే ఫస్టాఫ్‌లో కాస్త సాగదీత ఎక్కువగా ఉందనేలా, కొన్ని అనవసర సీన్లు ఉన్నాయంటూ కొందరు నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. అసలు ‘పుష్ప 2 ది రూల్’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..

హీరోయిక్ ఎలివేషన్స్, ఉత్కంఠభరితమైన విజువల్స్ అలాగే అల్లు అర్జున్ నట విశ్వరూపంతో.. ప్రతి ఫ్రేమ్ ప్యూర్ మ్యాజిక్‌గా అనిపిస్తుంది. మాస్ ఎంటర్‌టైనర్‌ను సుకుమార్ రూపొందించారు. అస్సలు మిస్సవ్వవద్దు.. అంటూ ఓ నెటిజన్ బ్లాక్‌బస్టర్ అని ప్రకటించేశారు.


మొత్తంగా చెప్పాలంటే మూవీ హిట్. జాతర ఎపిసోడ్‌లోనూ అలాగే క్లైమాక్స్‌లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూస్తారని మరో నెటిజన్ పేర్కొన్నారు.


ఇండియన్ సినిమా హిస్టరీలో అద్భుతమైన సన్నివేశాలతో వచ్చిన సినిమా ఇది. గంగమ్మ జాతర ఎపిసోడ్‌ వచ్చినప్పుడు ఏ హీరో ఫ్యాన్ అయినా సరే.. దొమ్మాలు అదురుతాయి. కాకపోతే కిస్సిక్ సాంగ్ కంటే ఊ అంటావా పాటకే ఎక్కువ మార్కులు పడతాయి.. అంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చారు.


ప్రతి సన్నివేశంలో అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కనిపిస్తోంది. జాతర ఎపిసోడ్ స్టన్నింగ్‌గా ఉంది. పుష్ప2 సినిమాను సుకుమార్ ఎక్కువగా ఎలివేషన్ మోడ్‌లోనే తీశారు. అల్లు అర్జున్ రూల్ మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే వెరీ గుడ్ ఫిల్మ్ పుష్ప 2.. అని ఓ నెటిజన్ ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.


అల్లు అర్జున్ నటన, డ్యాన్స్, ఫైట్స్, అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో.. ఈ సినిమాకు పాజిటివ్స్. వీక్ స్టోరీ, స్ట్రాంగ్ విలన్‌ని చివరికి కామెడీ పీస్‌ని చేయడం అనేది ఈ సినిమాకు డ్రా బ్యాక్స్ అంటూ ఓ నెటిజన్ తన రివ్యూ ఇచ్చారు.


ఇలా చాలా వరకు పాజిటివ్‌గాన ట్విట్టర్ ఎక్స్‌లో రివ్యూస్ పడుతున్నాయి. ఓవరాల్‌గా మాత్రం ఫస్టాఫ్‌లో సాగదీత సీన్లు ఉన్నాయని.. వాటిని ఎడిట్ చేసి ఉంటే.. సినిమా అదిరిపోయేదనేలా రివ్యూవర్స్ కూడా తమ రివ్యూలలో చెబుతూ ఉన్నారు. కాకపోతే.. టికెట్ కోసం పెట్టిన డబ్బులకి పుష్పరాజ్ డిజప్పాయింట్ చేయడంటూ అంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.

Updated Date - Dec 05 , 2024 | 07:54 AM