Pushpa 2 The Rule: అనుకున్నంతా అయింది.. 'పుష్ప 2' వాయిదా! కొత్త రిలీజ్ డేట్ ఇదే

ABN , Publish Date - Jun 17 , 2024 | 08:58 PM

అంతా ఊహించిన‌ట్టుగానే అయింది. గ‌త కొద్ది రోజులుగా పుష్ఫ 2 సినిమా విష‌యంలో వ‌స్తున్న వార్త‌ల విష‌యంలో బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారాలే నిజ‌మ‌య్యాయి. ఈ మేర‌కు అప్డేట్ వ‌చ్చింది.

Pushpa 2 The Rule: అనుకున్నంతా అయింది.. 'పుష్ప 2' వాయిదా! కొత్త రిలీజ్ డేట్ ఇదే
pushpa

అంతా ఊహించిన‌ట్టుగానే అయింది. గ‌త కొద్ది రోజులుగా పుష్ఫ 2 (Pushpa2TheRule) సినిమా విష‌యంలో వ‌స్తున్న వార్త‌ల విష‌యంలో బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారాలే నిజ‌మ‌య్యాయి. ఈ మేర‌కు అప్డేట్ వ‌చ్చింది. ఇన్నాళ్లు ప్ర‌చారం జ‌రిగిన వార్త‌లే నిజం అన్న‌ట్లుగా చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్టు పెట్టింది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా నిరాశ‌కు లోన‌య్యారు.

WhatsApp Image 2024-06-17 at 8.31.54 PM.jpeg


ఇంకా పుష్ఫ 2 (Pushpa2TheRule) సినిమా షూటింగ్ చాలా భాగం చేయాల్సి ఉండ‌డం, పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులకు అధిక స‌మ‌యం వెచ్చించాల్సిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

WhatsApp Image 2024-06-17 at 8.31.56 PM.jpeg

ముందుగా అనుకున్న ప్ర‌కారం ఆగ‌స్టు 15న కాకుండా డిసెంబ‌ర్ 6న థియేట‌ర్ల‌లోకి తీసుకురానున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

Updated Date - Jun 17 , 2024 | 09:23 PM