Pushpa 2: పెళ్ళాం మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా.. అల్లు అర్జున్
ABN , Publish Date - Nov 29 , 2024 | 09:07 AM
కొచ్చిన్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడిన తీరు నేషనల్ వైడ్‌గా అభిమానులని ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మేనియాకి ఇతర సినిమాల అప్డేట్లు కనుమరుగవుతున్నాయి. వరుసగా భారీ ఈవెంట్ లతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక పాట్నా, చెన్నై ఈవెంట్‌ల తర్వాత కొచ్చిన్ లో భారీ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. మలబార్ నేలలో బన్నీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా, ఈ ఈవెంట్‌లో బన్నీ హీరోయిన్ రశ్మికను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన స్పీచ్ ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో నేషనల్ క్రష్ రష్మికా.. నేషన్ మొత్తాన్ని క్రష్ చేస్తుంది అన్నారు. ఆమెని నా శ్రీవల్లి అంటూ సంబోధించారు. రష్మికాతనకు కేవలం కో-స్టార్ మాత్రమే కాదు మేమిద్దరం డీప్ వర్కింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాం అన్నారు. " సెట్‌లో నేను చూసే ఏకైక హీరోయిన్ రష్మిక.. ఆమెతో పని చేయడం చాలా కంఫర్ట్‌గా ఇంట్లో వాళ్ళతో పని చేస్తున్నట్లు అనిపించింది. నా కెరీర్‌లో గొప్ప అనుభవాన్ని అందించినా నీకు స్పెషల్ థ్యాంక్స్. శ్రీవల్లి లేకపోతే ఈ పుష్ప రాజ్ లేడు" అంటూ అన్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో వాన్ సీన్ తో మహిళల ఆగ్రహానికి గురైన మేకర్స్ ఈ సారి 'పెళ్ళాం మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా' లాంటి డైలాగ్‌లతో కొత్త డైమెన్షన్‌ని చూపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో రష్మిక మాట్లాడుతూ.. ‘‘మీ (అభిమానులు) స్వాగతం చూసి నా మైండ్ బ్లాంక్ అయ్యింది. మీ ప్రేమకు ఫిదా అయిపోయాను. అల్లు అర్జున్ మీద మీ ప్రేమ వెలకట్టలేనిది. అల్లు అర్జున్ నా జీవితంలో ఎప్పుడూ ఒక స్పెషల్ పర్సన్. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏంటంటే.. ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఒక్కరు కాదు సినిమా చూసిన అందరూ ఎంజాయ్ చేస్తారు. నాకు కుదిరితే కొచ్చి వచ్చి మీతో (ప్రేక్షకులు) కలిసి సినిమా చూస్తాను. కేరళతో నా అనుబంధం చాలా గొప్పది. మీరంటే నాకు ఎంతో ప్రేమ అని అన్నారు. అంతేకాదు, కేరళ అభిమానుల కోసం రష్మిక ఈ వేదికపై సామీ సామీ సాంగ్‌కు డ్యాన్స్ కూడా చేశారు.