Pushpa 2: అల్లు ఈజ్ న్యూ మెగా.. శిల్పా రవి రెడ్డి
ABN , Publish Date - Dec 05 , 2024 | 06:04 PM
ఒక రకంగా 'మెగా వర్సెస్ అల్లు' రచ్చకి పునాది వేసిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే, అల్లు అర్జున్ స్నేహితుడు శిల్పా రవి రెడ్డి 'పుష్ప 2' సినిమాపై చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూల్ చేస్తోంది. ‘పుష్ప’ చిత్రంతో తన సత్తా చాటిన అల్లు అర్జున్, ఇప్పుడు ‘పుష్ప 2’తో మరోసారి తన పవర్‌ని బాక్సాఫీస్‌కి పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి. ఇంతకీ వాళ్ళేమన్నారంటే..
మొదటి నుండి పుష్ప రాజ్ 'అల్లు అర్జున్'ని సపోర్ట్ చేస్తూ వస్తున్న దర్శకుడు మరోసారి వరుస పోస్టులతో 'పుష్ప 2' మద్దతు తెలుపుతున్నాడు. ఆయన వరుసగా.. "మా అందరికి అల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అందించినందుకు అల్లు అర్జున్ అండ్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. అల్లు ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా" అంటూ పోస్ట్ చేశాడు.
తర్వాత, " అల్లు ఈజ్ మెగా టూ ది పవర్ అఫ్ ఒమేగా.. అది బాక్సాఫీస్ మేనియాని సృష్టించింది. 1913 నుండి ప్రారంభమైన 101 ఏళ్ల భారతీయ సినీ చరిత్రలో నిస్సందేహంగా అల్లు అర్జునే పెద్ద మెగాస్టార్" అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఇది వైల్డ్ ఫైర్ కాదు.. వరల్డ్ ఫైర్ అంటూ ఆకాశానికెత్తేశాడు.
ఇక నంద్యాల మాజీ ఎమ్మెల్యే, అల్లు అర్జున్ స్నేహితుడు శిల్పా రవి రెడ్డి కూడా బుధవారం సాయంత్రమే అల్లు అర్జున్ ని కలిశాడు. ఆయనతో పాటు సంధ్య థియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లారు. ఆయన కలిసిన దిగిన ఫోటోలని షోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.