Allu Arjun: సాక్ష్యాలు చూపించి మరి అడిగారు..
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:10 PM
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. పోలీసులు ఆయనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అనంతరం పోలీసు ఎస్కార్ట్‌తో..
'పుష్ప 2' ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో విచారణ నిమిత్తం A 11 అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు విచారించారు. దాదాపు మూడున్నర గంటలసేపటి తర్వాత ఈ విచారణ ముగిసింది. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేతృత్వంలో ప్రశ్నల వర్షం కురిపించారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలను సాక్షాలుగా చూపించి బన్నీని విచారించారు. విచారణ అనంతరం బన్నీని పొలిసు ఎస్కార్ట్ తో జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి పంపించారు.
కాగా , అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని.. అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్‌కు పోలీసులు తెలిపారు. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. మొత్తం విచారణను వీడియో రికార్డ్ చేశారు.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జు్న్‌కు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును కోరినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారని.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో బెయిల్ రద్దు చేయాలని కోరినట్లు సమాచారం.