Allu Arjun: బన్నీకి మధ్యంతర బెయిల్‌

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:45 PM

సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. సంఽధ్య థియేటర్‌ ఘటనలె నిందితుడిగా ఉన్న అల్ల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సినీ నటుడు అల్లు అర్జున్‌కు (Allu Arjun) హైకోర్టులో కాస్త ఊరట లభించింది. సంధ్య థియేటర్‌ ఘటనలె నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో అరెస్టైన నటుడు అల్లు అర్జున్‌ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది.

allu arjun.jpeg

 న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అర్జున్  తరపున న్యాయవాది కోరగా.. కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదావేస్తే తక్షణమే బెయిల్ మంజూరుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరగా.. ప్రభుత్వ తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. బెయిల్, క్వాష్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వ లాయర్ కోరారు. తన క్లైంట్‌పై పెట్టిన కేసు కొట్టేయాలని 118 (1) బీఎన్‌ఎస్ అల్లు అర్జున్‌కు వర్తించదని ఆయన తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే మీ అభ్యంతరం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఈఘటనకు పాల్పడలేదని, తన క్లైంట్‌కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిరంజన్ రెడ్డి వాదించారు.

Updated Date - Dec 13 , 2024 | 06:06 PM