Allu Arjun Arrest: అత్యవసర పిటిషన్‌.. సోమవారం విచారణ

ABN , Publish Date - Dec 13 , 2024 | 03:10 PM

శుక్రవారం అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే అల్ల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్‌గా (quash petition) విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. ‘

సంధ్య థియేటర్‌ (Sandhya Theatre) వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుష్ఫ-2 రిలీజ్‌ రోజున సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటతో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే! ఈ ఘటనలో థియేటర్‌ యాజమాన్యం, అల్లు అర్జున్‌నూ రేవతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం బన్నీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ బన్ని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే అల్ల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్‌గా (quash petition) విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. ‘అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకే మెన్షన్‌ చేయాలి కదా’ అని  కోర్టు ప్రశ్నించింది.

బుధవారం రోజు పిటిషన్‌ ఫైల్‌ చేశామని, క్వాష్‌ పిటిషన్‌ను వేసినట్లు పోలీస్చు దృష్టికి కూడా తీసుకెళ్లామని న్యాయవాది నిరంజన్‌ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్‌ మోషన్‌ పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు. బుధవారం పిటిషన్‌ దాఖలు చేసి, నెంబర్‌ అయినా.. కోర్టు సిబ్బంది బిజీగా ఉండటం వల్ల లిస్టులోకి రాకపోయి ఉండొచ్చని వివరించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ విచారించాలనడం సరైనది కాదని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సోమవారం వరకూ ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టును కోరారు. అయితే, పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది.. న్యాయస్థానానికి తెలిపారు. 

Updated Date - Dec 13 , 2024 | 03:11 PM