Allu Arjun: బన్నీ నటించడం లేదు.. తపస్సు చేస్తున్నాడు

ABN , Publish Date - Nov 16 , 2024 | 06:48 PM

"తెలుగు సినిమా ఇండస్ట్రీలో  డ్యాన్స్‌లో నువ్వే టాప్‌ అనుకుంటున్నావా? అని బాలయ్య అడిగిన ప్రశ్నకు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) ఆసక్తికర సమాధానమిచ్చారు. 'నిజమే సర్‌.. బాలకృష్ణ (Bala Krishna) గారు చెప్పారు.

"తెలుగు సినిమా ఇండస్ట్రీలో  డ్యాన్స్‌లో నువ్వే టాప్‌ అనుకుంటున్నావా? అని బాలయ్య అడిగిన ప్రశ్నకు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) ఆసక్తికర సమాధానమిచ్చారు. 'నిజమే సర్‌.. బాలకృష్ణ (Bala Krishna) గారు చెప్పారు కాబట్టి నేనే నంబర్‌ వన్‌ డ్యాన్సర్‌ని అని నవ్వుతూ జవాబిచ్చారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ 4’ (Unstoppable 4) నాలుగో ఎపిసోడ్‌ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా బాలయ్య ప్రశ్నలకు అంతే  హుందాగా సమాధానమిచ్చారు బన్నీ.

అల్లు అర్జున్‌ 21 ఏళ్ల కెరీర్‌ గురించి టాలీవుడ్‌ ప్రముఖులు ఏమన్నారంటే..  
రాఘవేంద్రరావు: నా 100వ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి  పరిచయమైన అల్ల్లు అర్జున్‌.. ఈరోజు ఐకాన్‌ స్టార్‌గా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో రానున్న ‘పుష్ప2’ కలెక్షన్లలో ‘తగ్గేదే లే’ అంటూ దుమ్ముదులపాలని కోరుకుంటున్నా.
గుణ శేఖర్‌: అల్లు అర్జున్‌.. సినిమా హిట్‌ అయితే ఒకలా.. కాకపోతే మరోలా ఉండడు. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వరుడు చిత్రం ప్రేక్షకాదరణ పొందలేదు. అప్పుడు బన్నీ ఫోన్‌ చేసి ధైర్యం చెప్పాడు. ఇప్పుడు తాను సాధిస్తున్న విజయాలు అన్నింటికీ అర్హుడు.

దిల్‌ రాజు: ప్రతి సినిమాకు తన తపన, హార్డ్‌ వర్క్‌ అన్ని కలిసి.. బన్నీ నుంచి ఏఏ బ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలానే ఎదగాలని కోరుకుంటున్నా.

త్రివిక్రమ్‌: తొలిసారి అల్లు అర్జున్‌ కలిసినప్పుడే.. మా స్నేహం చాలా ఏళ్లు ఉంటుందనిపించింది. ప్రతి సినిమాకు ఆయన స్టార్‌డమ్‌ విపరీతంగా పెరిగిపోవడంతోపాటు.. వ్యక్తిగా కూడా చాలా ఎదిగాడు. దిష్టి తగిలేంత గొప్పవాడు అయ్యాడు. భారతీయ సినిమా చరిత్రలో విజయాల జాబితా సిద్థం చేేస్త అందులో అల్లు అర్జున్‌ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ప్రస్తుతం బన్నీ నటించడం లేదు.. తపస్సు చేస్తున్నాడు. ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి. తెలుగు సినిమా రంగం నుంచి మమ్మల్ని అంతర్జాతీయ వేదిక పైకి తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న హీరో అల్లు అర్జున్‌.

Prabhas.jpg

పెళ్లికి ముందు ఎంతమంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు? వాళ్లలో ఎంతమంది గురించి మీ ఆవిడకు చెప్పావు?

ఈ టాక్‌షో నా పిల్లలు చూస్తారు. నేను చూసిన, ప్రేమించిన మొదటి అమ్మాయి మీ అమ్మ అని వాళ్లకు చెప్పాను. అందుకే ఇప్పుడు వీటి గురించి ఇక్కడ చెప్పను. అయినా.. నా లవ్‌ స్టోరీలన్నీ మా ఆవిడకు తెలుసు.

టాలీవుడ్‌లో నీకు పోటీ ఎవరు.. ప్రభాస్‌.. మహేశ్‌ బాబా?
నన్ను మించి ఎదిగినవాడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవరంటే అది రేపటి నేనే. నాకు నేనే పోటీ. అలాగే నేను అందరినీ గౌరవిస్తాను.

గోవా బార్‌లో ఎందుకు కనిపించావు?
నేను ఆల్కహాల్‌కు దూరం. ‘నాపేరు సూర్య’ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు.. మా ఫ్రెండ్‌ గోవాకు వచ్చాడు. ఏం కావాలని వాడిని అడిగితే ఒక బ్రాండ్‌ పేరు చెప్పాడు. నేను బాయ్‌ను పిలిచి చెప్పాను. తనకు అర్థం కావడంలేదని నేనే బార్‌కు వెళ్లి అడిగాను. అది జరిగింది.

Updated Date - Nov 16 , 2024 | 06:48 PM