Allu Arjun: పవన్‌ కల్యాణ్‌పై బన్నీ కామెంట్స్‌

ABN , Publish Date - Nov 16 , 2024 | 09:24 PM

టాలీవుడ్‌ అగ్ర  హీరోలపై అల్లు అర్జున్‌ (Allu Arjun) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్‌ -4కు (Unstoppable 4) అతిథిగా హాజరైన ఆయన బాలయ్య అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు.


టాలీవుడ్‌ అగ్ర  హీరోలపై అల్లు అర్జున్‌ (Allu Arjun) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్‌ -4కు (Unstoppable 4) అతిథిగా హాజరైన ఆయన బాలయ్య అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) , మహేశ్‌బాబు, ప్రభాస్‌, బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ గురించి ఇలా చెప్పారు.

పవన్‌ కల్యాణ్‌: కల్యాణ్‌ గారి ధైౖర్యం నాకు ఇష్టం. నేను చాలామంది లీడర్స్‌ను దగ్గర నుంచి చూశాను. కానీ.. లైవ్‌లో దగ్గరి నుంచి చూసిన డేరింగ్‌ పర్సన్‌ కల్యాణ్‌ గారు.

మహేశ్‌ బాబు: అందరూ ఆయన అందం గురించే మాట్లాడతారు. కానీ.. ఆయన కమ్‌బ్యాక్స్‌ చాలా బాగుంటాయి. ఫెయిల్యూర్స్‌ తర్వాత ఆయన కమ్‌బ్యాక్స్‌ నాకు ఇష్టం. తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ పెంచిన వ్యక్తి.

ప్రభాస్‌: ఆరడుగుల బంగారం. మేమిద్దరం ేస్నహితులం. నాకు చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం నేను క్రిస్మస్‌ ట్రీ పెడతాను. ప్రభాస్‌కు ఈ విషయం తెలిసి నాకోసం యూరప్‌ నుంచి డెకరేషన్‌ ఐటెమ్స్‌ తీసుకొచ్చారు.

రణ్‌బీర్‌ కపూర్‌: బాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో వావ్‌ అనిపించే యాక్టర్‌. నేను, రణ్‌బీర్‌ మల్టీరర్‌ చేేస్త అద్భుతంగా ఉంటుంది’’ అని బన్నీ అన్నారు.


అలాగే ఈ షోలో అల్లు అర్జున్‌ తల్లి నిర్మల కూడా పాల్గొన్నారు. బన్నీ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు.

అల్లు నిర్మల: హీరో అయ్యాక ఒకరోజు నా దగ్గరకు వచ్చి నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. నువ్వు ఆ అమ్మాయితో సంతోషంగా ఉండగలను అని అనుకుంటే చేసుకోమని చెప్పా.

అర్జున్‌ గురించి ఏ విషయంలోనైనా బాధపడతారా?

నిర్మల: ఒకటి అనుకుంటే ఇంక దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వీడు ఎవరి మాటైనా వింటే బాగుండు అని అనుకుంటూ ఉంటా. ప్రతి దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటాడు. ‘జయం ’ సినిమా సమయంలో తనకు వస్తుందనుకున్న రోల్‌ రాకపోయినా బాధపడలేదు. ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి ఎలా బయటకు రావాలని ఆలోచిస్తుంటాడు.

బన్నీ నటుడు అవుతాడు అని ఎప్పుడనిపించింది?
నిర్మల: చిరంజీవి గారి సినిమాల 50 రోజుల ఫంక్షన్ చూసినప్పుడు బన్నీ కూడా ఇలా హీరో అయితే బాగుండు అనుకునేదాన్ని’’ అని అన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 09:24 PM