Allu Arjun: ఆ వార్తల్లో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన బన్నీ
ABN , Publish Date - Dec 12 , 2024 | 08:38 PM
ఫేక్ న్యూస్‌పై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాల గట్టిగా వినిపిస్తున్న పేరు. ఒకవైపు 'పుష్ప 2' రిలీజ్ మరోవైపు సంధ్య థియేటర్ ఘటనతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతోంది. ఈ దశలోనే కొందరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ టీమ్ ఫేక్ న్యూస్ పై స్పందించింది.
అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారని కొన్ని రోజుల నుండి పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై అల్లు అర్జున్ టీమ్ స్పందిస్తూ ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయొద్దని కోరారు. ప్రధానంగా మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులను దయతో అభ్యర్థిస్తున్నామని తెలిపారు. ఇక ఖచ్చితమైన అప్‌డేట్‌ల కోసం, దయచేసి అల్లు అర్జున్ టీమ్ అధికారిక మాధ్యమాలను మాత్రమే ఫాలో అవ్వండి కోరారు. మరోవైపు 'పుష్ప 2' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ.1000కోట్లు కొల్లగొట్టింది.