Allu Arjun: ఏడ్చేసిన బన్నీ.. పోలీసుల ఏం చూపించారంటే
ABN , Publish Date - Dec 24 , 2024 | 09:19 PM
Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో A 11, యాక్టర్ అల్లు అర్జున్‌నుచిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మరుసటి రోజు విడుదల చేశారు. అయితే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను(Allu Arjun) చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మరుసటి రోజు విడుదల చేశారు. అయితే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. మరోసారి అల్లు అర్జున్‌ను ఇవాళ(మంగళవారం) విచారించారు.ఈ విచారణలో అల్లు అర్జున్‌పై పోలీసులు ప్రశ్నలవర్షం కురిపించారు. పోలీసుల విచారణలో ఓ వీడియో చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. మూడు గంటల 35 నిమిషాలు అల్లు అర్జున్‌ని పోలీసులు విచారించారు. సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు తయారు చేసిన వీడియో చూసి కొంత భావొద్వేగానికి అల్లు అర్జున్ లోనయ్యారని సమాచారం. పోలీస్ ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పారు. కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని.. థియేటర్ లోపల చీకటిగా ఉన్ననందున అర్ధం కాలేదని సమాధానమిచ్చారని తెలుస్తోంది. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నారని సమాచారం మళ్లీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని అల్లు అర్జున్. చెప్పారు. పూర్తి విచారణను పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. విచారణ సమయంలో కేవలం మూడు సార్లు మాత్రమే అల్లు అర్జున్ వాటర్ తాగారు. తన వాహనంలో ఉన్న బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, తిని అల్లు అర్జున్ టీ తాగారని సమాచారం.
కాగా.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అల్లు అర్జున్ లాయర్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆ విచారణలో అల్లు అర్జున్‌ను మధ్యాహ్నం 2.47 గంటల వరకు విచారించారు. ఈ విచారణలో ఏసీపీ రమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగినపుడు రమేష్ కుమార్ కుమార్ అక్కడే ఉన్నారు.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై మూడు గంటలు పాటు విచారణ చేసిన పోలీసులు.. అల్లు అర్జున్‌ను 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు పోలీసులు. అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని.. అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్‌కు పోలీసులు తెలిపారు. పోలీసులు సేకరించిన వీడియోలు, సీసీ ఫుటేజ్‌ను ముందు పెట్టి అల్లు అర్జున్‌ను విచారించారు.