Allu Arjun: ‘ఆయ్’ సినిమాకు.. అల్లు అర్జున్ బెస్ట్ విషెస్

ABN , Publish Date - Aug 13 , 2024 | 08:17 PM

జాతీయ అవార్డు గ్ర‌హీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ త‌న మ‌ద్ధ‌తుని తెలియ‌జేస్తుంటారు. అందులో భాగంగా మ‌రోసారి ‘ఆయ్’ చిత్రానికి ఆయ‌న త‌న మ‌ద్ధ‌తుని తెలియ‌జేశారు.

aay

జాతీయ అవార్డు గ్ర‌హీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ త‌న మ‌ద్ధ‌తుని తెలియ‌జేస్తుంటారు. అందులో భాగంగా మ‌రోసారి ‘ఆయ్’ (Aay) చిత్రానికి ఆయ‌న త‌న మ‌ద్ధ‌తుని తెలియ‌జేశారు. మ్యాడ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌ డైన‌మిక్ స్టార్ నార్నే నితిన్ (Narne Nithiin), న‌య‌న్ సారిక (Nayan Sarika) జంట‌గా న‌టించారు. అంజి కె మ‌ణిపుత్ర (Anji K Maniputhra) ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను నిర్మించే జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఏస్ ప్రొడ్యూస్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాస్ (Bunny Vas), విద్యా కొప్పినీడి (Vidya Koppineedi) మూవీని నిర్మించారు.

Aay-Movie.jpg

. గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీతో నార్నే నితిన్ (Narne Nithiin) రెండోసారి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. గోదావ‌రికి చెందిన ప‌ల్లెలో ఉండే స్నేహితుల చుట్టూ తిరిగే క‌థతో ఆయ్ సినిమాను తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి తిరుగులేని రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతుంది. కాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు శ్రీలీల‌, నిఖిల్ అతిథులుగా రానున్నారు.


మ‌రో రెండు రోజుల్లో ఈ సినిమా విడుద‌ల‌వుతున్న క్ర‌మంలో చిత్ర‌ నిర్మాత బ‌న్నీ వాస్‌, అత‌ని సోద‌రి విద్యా కొప్పినీడికి అల్లు అర్జున్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. ‘నాకెంతో సన్నిహితుడైన బన్నీ వాస్, సోదరి విద్యా కొప్పినీడికి శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నాను. వీరు మా గీతా ఆర్ట్స్( GA2 Pictures) బ్యాన‌ర్‌లో భాగ‌మ‌య్యారు. నా మ‌న‌సుకెంతో ద‌గ్గ‌రైన వీరికి ‘ఆయ్’ సినిమా మంచి స‌క్సెస్‌ను అందిస్తుంద‌ని న‌మ్ముతున్నాను’ అన్నారు. ఆయ్ చిత్రానికి ఐకాన్ స్టార్ నుంచి తిరుగులేని మ‌ద్ధ‌తు ల‌భించ‌టంతో ఆయ్ చిత్ర యూనిట్‌కు మంచి ఎన‌ర్జీ వ‌చ్చిన‌ట్టైంది.

Updated Date - Aug 13 , 2024 | 08:17 PM