Allu Arjun Arrest: బన్నీకి అండగా నిలుస్తున్న సినీ ప్రపంచం
ABN , Publish Date - Dec 13 , 2024 | 05:37 PM
అల్లు అర్జున్ అరెస్ట్‌తో సినీ ప్రపంచం అతని కుటుంబానికి అండగా నిలుస్తున్నారు..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరు పరిచారు. నాంపల్లి కోర్టు 14రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రపంచం అల్లు అర్జున్ కి అండగా
బన్నీని జైలుకి తరలిస్తున్న విషయం తెలియగానే అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ రానా దగ్గుబాటి హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి దంపతులతో పాటు నాగ బాబు చేరుకున్నారు. అలాగే హీరో నాని కూడా ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ బన్నీకి మద్దతు ప్రకటించారు. మరోవైపు BRS, BJP లీడర్లు అల్లు అర్జున్ కి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
అల్లు అర్జున్ పై 105, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.