Trivikram: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ అప్‌డేట్ వచ్చేది అప్పుడే!
ABN , Publish Date - Dec 08 , 2024 | 07:13 PM
అల్లు అర్జున్‌కు (Allu Arjun) పుష్ప హడావిడి అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్ట్స్ అనే చర్చ మొదలైంది. బన్నీ కమిట్‌మెంట్ ప్రకారం నెక్ట్స్ సినిమా త్రివిక్రమ్‌తో (Trivikram) ఉంది. అయితే ఈ చిత్రం ప్రారంభం జూన్ 2025లో ఉంటుంది అని అంతా అనుకున్నారు
అల్లు అర్జున్‌కు (Allu Arjun) పుష్ప హడావిడి అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్ట్స్ అనే చర్చ మొదలైంది. బన్నీ కమిట్‌మెంట్ ప్రకారం నెక్ట్స్ సినిమా త్రివిక్రమ్‌తో (Trivikram) ఉంది. అయితే ఈ చిత్రం ప్రారంభం జూన్ 2025లో ఉంటుంది అని అంతా అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ జనవరిలో ఉంటుందని టాక్ నడుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఓ మాంచి వీడియో కట్‌తో ఎప్పుడైనా ఈ సినిమా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు.
మూడేళ్లగా ఆయన ఇదే సినిమాతో బిజీగా ఉండటం వల్ల కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నారట. కొంత విశ్రాంతి తర్వాత నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడతారని తెలుస్తోంది. జానర్ ఏంటనేది తెలీదు కానీ.. ప్రస్తుతం త్రివిక్రమ్ కథ కథ, ప్రీ పొడక్షన్ పనుల్లో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో జులాయి’ సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు తీసి హ్యాట్రిక్ కొట్టారు. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి సన్నదమవుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది.