Sandhya Theatre Stampede: అల్లు అర్జున్ ఎందుకు రాలేదంటే.. అల్లు అరవింద్

ABN , Publish Date - Dec 18 , 2024 | 05:00 PM

శ్రీతేజ్‌ని పరామర్శించిన అల్లు అరవింద్. అల్లు అర్జున్ ఎందుకు రాలేదంటే..

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై అల్లు అర్జున్ మరియు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌తో అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. తాజాగా అల్లు అర్జున్ తండ్రి, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ శ్రీతేజ్ ని కలిసి పరామర్శించారు.


సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్సపొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అరవింద్ పరామర్శించారు. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన అల్లు అరవింద్.. శ్రీతేజ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తల్లి రేవతి మృతిచెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తమకు పూర్తిస్థాయిలో సహకారం అందించిందని, కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్‌ రాలేకపోయారని అరవింద్ తెలిపారు. బన్నీ తరఫున తానే స్వయంగా ఆస్పత్రికి వచ్చినట్లు అల్లు అరవింద్ చెప్పారు.

Updated Date - Dec 18 , 2024 | 05:00 PM