Allu Aravind Comments: పవన్ కల్యాణ్ నుంచి శిరీష్ వరకూ
ABN , Publish Date - Mar 23 , 2024 | 03:42 PM
సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో వైభవంగా జరిగింది. అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చినందుకుగాను సినీ ప్రముఖులు ఆయన్ని ఘనంగా సత్కరించారు.
సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో వైభవంగా జరిగింది. అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చినందుకుగాను సినీ ప్రముఖులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. చిరంజీవి గురించి నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మా కుటుంబంలో ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు బాట వేసింది చిరంజీవిగారే. పవన్ కల్యాణ్ నుంచి అల్లు శిరీష్ వరకూ.. అందరూ ఆయన వేసిన బాటలో నడుస్తూ సినీ పరిశ్రమలో కెరీర్ నిర్మించుకున్నారు. అంత పెద్ద రహదారి వేశారాయన. మా కుటుంబంలోనే కాదు ఎంతో మంది యువ నటీనటులకు చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారు’’ అని అన్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆహా ఓటీటీ సంస్థలు సంయుక్తంగా సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని నిర్వహించాయి. శుక్రవారం ఉదయం జరిగిన చర్చా కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు విమర్శకులు, విశ్లేషకులు పాల్గొన్నారు. నిర్మాత స్వప్న దత్, ఎస్‌కేఎన్, సుస్మితా కొణిదెల, ఆనంద్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. తమ తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సినీ రంగంలో వస్తోన్న మార్పులపై అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే సాయంత్రం జరిగిన వేడుకలు యువ హీరోలు సందడి చేశారు. తేజ సజ్జా డ్యాన్స్‌తో అలరించారు.