Allu Aravind: నా కొడుకును అలా చూస్తుంటే.. గుండె తరుక్కుపోతుంది

ABN , Publish Date - Dec 21 , 2024 | 09:53 PM

దాదాపు 15 రోజుల నుండి అల్లు అర్జున్‌ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందని అన్నారు అల్లు అరవింద్. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌పై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని తెలుపుతూ.. అల్లు అరవింద్ శనివారం వారి ఇంట వద్ద జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇంకా అల్లు అరవింద్ ఏమన్నారంటే..

Allu Arjun and Allu Aravind

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ పోలీసు వాళ్లు చెప్పినా వినలేదంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పడంతో.. మరోసారి సంధ్య థియేటర్ ఘటన వార్తలలో హైలెట్ అవుతుంది. అయితే సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించేందుకు అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, లీగల్ టీమ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఈ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

Also Read- Allu Arjun Press Meet: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఏమన్నారంటే..


అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి అల్లు అర్జున్ ఎంతో బాధపడుతున్నాడని చెప్పుకొచ్చారు. ఎవరితో కలవలేకపోతున్నాడని, ఒంటరిగా కూర్చుని తనలో తనే బాధపడటం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని అరవింద్ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..


భారతీయ సినీ చరిత్రలోనే ‘పుష్ప-2’ సినిమా కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతంది. కానీ, సినిమా కోసం అంత కష్టపడిన అర్జున్.. థియేటర్‌‌లో మొదటి షోకి వెళ్లి.. ప్రేక్షకులు తనపై చూపించే ప్రేమను కళ్లారా చూడలేని పరిస్థితి నెలకొంది. సంధ్యా థియేటర్ ఘటన చాలా దురదృష్టకరం. ఆ ఘటనతో బన్నీ ఎంతో ఆవేదనకు గురయ్యారు. గత రెండు వారాలుగా ఇంట్లో ఉన్న గార్డెన్‌లోనే బన్నీ గడుపుతున్నాడు. స్నేహితులు లేదా బంధువులు ఇళ్లకి వెళ్లమని చెప్పినా వెళ్లడం లేదు. అర్జున్ అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. దయచేసి నా కుమారుడిపై ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నానని అల్లు అరవింద్ మీడియా ద్వారా కోరారు.

Also Read-అల్లు అర్జున్ కాలు విరిగిందా? చెయ్యి విరిగిందా?: సీఎం రేవంత్

Also Read-Sandhya Theatre Stampede: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read-UI Movie Review : ఉపేంద్ర నటించిన UI మూవీ ఎలా ఉందంటే..

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 21 , 2024 | 09:53 PM