Kannappa Movie: ‘కన్నప్ప’ నుంచి.. అక్షయ్ కుమార్‌ శివుడి ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్‌

ABN , Publish Date - Sep 09 , 2024 | 06:02 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 9) సందర్భంగా.. కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ పోషించిన శివుని పాత్రకి సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు.

kannappa

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa Movie) నుంచి ప్రతీ సోమవారం ఒక ఆప్డేట్ వదులుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సోమ‌వారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) పుట్టిన రోజు (సెప్టెంబర్ 9) సందర్భంగా.. కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ పోషించిన శివుని పాత్రకి సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు. రుద్రాక్ష మాలతో అలంకరించబడిన చేతిని చూపించారు. ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు.. భక్తికి మాత్రం దాసుడు అంటూ శివుని తత్త్వం గురించి చెప్పే డైలాగ్ పోస్టర్ మీద పెట్టారు.

GXAbdLZXIAAsSS6.jpeg

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ బాబు (Mohanbabu), ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్ (Mohanlal), శరత్ కుమార్ (Sarathkumar), కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం ఉంది. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.డిసెంబర్‌లో ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.

ఇదిలాఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం నుంచి శ‌ర‌త్ కుమార్ నాథనాథుడు, మ‌ధుబాల ప‌న్న‌గ‌, దేవ‌రాజ్‌ ముండ‌డు, సంప‌త్ రామ్ చుండ‌డు, ముఖేష్ రిషి ‘కంప‌డు’ లుక్స్ రిలీజ్ చేయ‌గా గ‌త వారం మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ భ‌క్త మంచు (Avram Manchu), అర్పిత్ రంకా (Arpit Ranka) ‘కాలాముఖ’ లుక్ పోస్టర్‌ను మూవీ టీం విడుదల చేయ‌గా అవ‌న్నీ మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకున్నాయి.

Updated Date - Sep 09 , 2024 | 06:02 PM