Pushpa 2: అసెంబ్లీలో 'పుష్ప 2' మంటలు

ABN , Publish Date - Dec 21 , 2024 | 02:50 PM

తెలంగాణ అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై తీవ్ర వాడీవేడి చర్చ జరుగుతుంది.

తెలంగాణ శాసనసభలో అల్లు అర్జున్ ప్రస్తావన తీసుకొచ్చాయి విపక్ష పార్టీలు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళా చనిపోయింది. 9 ఏళ్ల బాలుడు ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. హీరో మాత్రం అభిమానులకు అభివాదం చేస్తు వెళ్తున్నాడు. అల్లు అర్జున్ బాధ్యత రహితంగా వ్యవహరించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అంటూ ఆగ్రహంగా మాట్లాడారు.


ఏం జరిగిందంటే

తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవుతుందనగా.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (13) అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరితోపాటు తొక్కిసలాటలో మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్‌ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్‌ రావడం కూడా కారణమని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్‌తో అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు.

Updated Date - Dec 21 , 2024 | 03:33 PM