Akash Puri: ఈ మార్పుతో ఎలా ఆకర్షిస్తాడో.. !

ABN , Publish Date - Jul 25 , 2024 | 02:07 PM

సినీ సెలబ్రిటీలు పేర్లు మార్చడం, లేదా న్యూమరాలజీ ప్రకారం అక్షరాలు మార్చడం తరచూ చూస్తుంటాం.  తమ పేర్ల ముందు, వెనక ఏదో ఒకటి కొత్తగా జత చేస్తుంటారు. తాజాగా యువ హీరో ఆకాష్  పూరి తన పేరు మార్చుకున్నాడు.

సినీ సెలబ్రిటీలు పేర్లు మార్చడం, లేదా న్యూమరాలజీ ప్రకారం అక్షరాలు మార్చడం తరచూ చూస్తుంటాం.  తమ పేర్ల ముందు, వెనక ఏదో ఒకటి కొత్తగా జత చేస్తుంటారు. తాజాగా యువ హీరో ఆకాష్(Akash Puri) పూరి తన పేరు మార్చుకున్నాడు. ఇన్నాళ్లు  ఆకాష్  పూరిగా ఉన్న అతని పేరును  ఆకాష్  జగన్నాథ్‌గా (Akash Jagannadh) మార్చినట్లు పుట్టినరోజు సందర్భంగా గురువారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఇన్స్టా గ్రామ్‌ వేదికగా తెలిపాడు ఆకాష్  తను కొత్తగా కలిపింది తన తండ్రి పేరునే. అయితే ఉన్నట్టుండి పేరు మార్చుకోవడం వెనక కారణమేంటని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కెరీర్‌లో ఇంకా కలిసిరావడానికి ఎవరైనా సలహా ఇచ్చారేమో అని టాక్‌ వినిపిస్తోంది.  (Akash puri Now as Akash Jagannadh)


టాలీవుడ్‌ మాస్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ( Puri Jagannadh) తనయుడిగా  చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్‌.  చిరుత, బుజ్జిగాడు, గబ్బర్‌సింగ్‌, బిజినెస్‌మెన్  వంటి చిత్రాల్లో  చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించిన  ఆకాష్    2015లో ఆంధ్రాపోరి’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత మెహబూబా, రొమాంటిక్‌, చోర్‌ బజార్‌.. సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరి పేరు మార్చుకున్నాక ఆకాష్‌ జగన్నాధ్‌ ఎలాంటి సినిమాలతో మెప్పిస్తాడో చూడాలి.

Updated Date - Jul 25 , 2024 | 02:07 PM