Venkatesh: మరో హీరోయిన్ ఖరారు.. సంక్రాంతి బరిలో..

ABN , Publish Date - Jul 02 , 2024 | 11:38 AM

గతేడాది 'భగవంత్ కేసరి’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. వెంకటేష్‌తో ఆయనొక సినిమా చేయబోతున్నారనే వార్త చాలాకాలంగా హల్‌చల్‌ చేస్తోంది.

Venkatesh: మరో హీరోయిన్ ఖరారు.. సంక్రాంతి బరిలో..

గతేడాది 'భగవంత్ కేసరి’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi). తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. వెంకటేష్‌తో (venkatesh) ఆయనొక సినిమా చేయబోతున్నారనే వార్త చాలాకాలంగా హల్‌చల్‌ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. 'ఎఫ్‌2', 'ఎఫ్‌3' చిత్రాల తర్వాత వెంకటేశ్ తో  అనిల్‌ పని చేస్తున్న చిత్రమిది. ఇందులో ఓ నాయికగా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో నాయిక పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ని (Aishwarya Rajesh) తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థ్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన  స్క్రిప్ట్ ను  స్వామి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు.

Rajesh.jpg

అనంతరం అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో వెంకటేశ్‌ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ నెల 3 నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. నవంబరులో పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఎస్.వి.సి సంస్థలో వస్తున్నా 58వ చిత్రమిది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Updated Date - Jul 02 , 2024 | 11:41 AM