Adivi Sesh's Dacoit: ఫైనల్‌గా శేష్‌కి తోడు దొరికేసింది.. ఎవరు ఆమె
ABN , Publish Date - Dec 16 , 2024 | 06:02 PM
హీరో అడివి శేష్‌కి ఫైనల్‌గా హీరోయిన్ దొరికేసింది. కానీ.. ఆమె ఎవరో తెలియడం లేదు. దీని గురించి ఆయన రేపు క్లారిటీ ఇవ్వనున్నారు.
టాలెంటెడ్ హీరో అడివి శేష్ 'మేజర్', 'హిట్–2' చిత్రాల సక్సెస్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘గూఢచారి’ వంటి సూపర్ హిట్ సినిమాకు కొనసాగింపుగా జీ 2’ (G2)ప్రారంభించారు. ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన షానీల్ డియోను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘డకాయిట్’ (Dacoit) సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ ని రివీల్ చేసే విషయంలో ఆయన సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన హీరోయిన్ల విషయంలో మాత్రం పలు సమస్యలు ఎదురువుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ బానిత సందుని మొదటగా హీరోయిన్ పాత్రకు సెలక్ట్ చేయగా కొన్ని రోజుల తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. తర్వాత కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ లో చేరింది. కానీ.. ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా శేష్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఓ అమ్మాయి గన్ పట్టుకుని ఎవరికో గురి పెట్టినట్లు కనిపించగా.. అడివి శేష్ గాయాలతో ఆమె ముఖానికి చేయి అడ్డుపెట్టి ఉన్నాడు. దీనికి క్యాప్షన్ గా ‘‘తనని కాపాడినా.. కానీ ఒదిలేసినాది.. తను ఏంటో.. అసలెవరో రేపు తెలిసొస్తాది. ఉదయం 11: 30 గంటలకు అప్డేట్ రాబోతుంది’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఇంతకీ ఆ పోస్టర్ లో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత బజ్ పెరిగింది. చాలా మంది మాత్రం ఆమెని మృణాల్ ఠాకూర్ గా భావిస్తున్నారు.