Sharanya: నా భర్త సపోర్ట్ వళ్లే.. సినిమాలో నగ్నంగా నటించగలిగా
ABN , Publish Date - Feb 05 , 2024 | 09:05 PM
ఇటీవలే థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం వైపు దూసుకెళుతున్న చిత్రం అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. సుహాస్, శివాని, శరణ్య , నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రలు పొషించారు. అయితే సినిమాలోని న్యూడ్ సన్నివేశం గురించి శరణ్య కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
ఇటీవలే థియేటరర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ విజయం వైపు దూసుకెళుతున్న చిత్రం అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ (Ambajipeta MarriageBand). సుహాస్ (Suhas), శివాని (Shivani Nagaram), శరణ్య (Sharanya), నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రలు పొషించగా దుష్యంత్ కటికనేని (Dushyanth Katikaneni) దర్శకత్వం వహించారు. రిలీజైన మొదటి ఆట నుంచే మంచి మౌత్ టాక్‌తో రొజురోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ మస్ట్ వాచ్ మూవీగా పేరు తెచ్చుకుంది. 2007లో అంబాజీపేట గ్రామంలో జరిగే కథ ఇతివృత్తంలో ఈ సినిమా రూపొందగా ఆ ఊర్లో సెలూన్ నడుపుకుంటూ, బ్యాండు వాయిస్తూ జీవిస్తున్న ఓ సాధారణ కుటుంబం, స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న హీరో అక్క పద్మ(శరణ్య), డబ్బులు వడ్డీలకు ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఆ ఊరి పెద్దకు మధ్య జరిగే కథగా సినిమా ఆధ్యంతం ఆకట్టుకుంది.
ఇంతకుముందు ఎన్నడు రానటువంటి అత్బాభిమానం అనే టిపికల్ పాయింట్‌తో ఈ సినిమా సాగుతూ చూసే ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేశారు. అయితే ఈ చిత్రంలో హీరోగా సుహాస్ (Suhas) కథానాయికగా శివాని (Shivani Nagaram) ఉన్నప్పటికీ హీరోకు అక్క పద్మగా చేసిన శరణ్య (Sharanya)నే వందకు వంద మార్కులు కొట్టేసింది. సినిమా చూసిన వారంతా ఆమె క్యారెక్టర్‌నే బాగా మెచ్చుకుంటున్నారంటే ఆ పాత్ర ఇంఫాక్ట్ సినిమాలో ఎంతగా ఉందో అర్ధమవుతుంది. విలన్ (నితిన్ ప్రసన్న)కు ధీటుగా నటించి వాహ్వా అనిపించింది.
ముఖ్యంగా పద్మ పొలీస్ స్టేషన్‌లో విలన్‌ను కాలితో తన్నే సన్నివేశానికి థియేటర్ అంతా విజిల్స్ వేశారంటే ప్రేక్షకులు ఎంతగా లీనమయ్యారో తెలుస్తుంది. అదేవిధంగా స్కూల్‌లో పద్మ(శరణ్య)ను విలన్ వివస్త్రను చేసే సీన్ కూడా చాలా ఎమోషనల్‌గా సాగింది. అయితే ఇంతవరకు చాలా సినిమాలలో గర్ల్ నెక్ట్స్ డోర్,పక్కింటి అమ్మాయి పాత్రలు,పక్కా తెలంగాణ యాస పాత్రలు మాత్రమే చేస్తు ఏనాడు ఎక్స్‌ఫోజింగ్ పాత్రలు చేయని శరణ్య ఈ సినిమాలో ఓ సీన్‌లో న్యూడ్‌గా నటించడం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ క్రమంలో స్కూల్‌లో న్యూడ్ సన్నివేశం గురించి శరణ్య (Sharanya) ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. ఆ సన్నివేశం చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశానని, నా భర్త ప్రోత్సాహం వళ్లే ఆ సన్నివేశం చేయగలిగానని నువ్వు చేయ్ ఫర్లేదు, నువ్వు చేయగలవని,ఇది చాలా స్ట్రాంగ్ క్యారెక్టరని చెప్పడంతో చేశానని అందువల్లే ఆ సీన్ బాగా వచ్చిందని చాలా మంది ఎమోషనల్ అయ్యారని పేర్కొంది. కేవలం ఐదుగురు యూనిట్ సభ్యుల సమక్షంలోనే (డీవోపీ భేగ్, కాస్టూమ్ డిజైనర్ అఖిల, డైరెక్టర్ దుశ్యంత్, విలన్ నితిన్ ప్రసన్న, అసోసియేట్ ప్రవీణ్) ఆ సన్నివేశం చిత్రీకరించారని తెలిపింది. వారెంతో కో ఆపరేట్ చేశారని, లేకుంటే ఇన్‌కన్వినియన్స్ ఫీలయ్యేదానినని అంటూ చెప్పుకొచ్చింది