Samantha, Vijay: మ‌రోసారి.. విజయ్‌తో సమంత?

ABN , Publish Date - Jul 04 , 2024 | 04:04 PM

చేతిలో సినిమాలు అంత‌గా లేకున్నా ఈ మ‌ధ్య బాగా వార్త‌ల్లో నిలుస్తోంది స‌మంత. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన‌ట్లు తెలుస్తోంది.

samantha

చేతిలో సినిమాలు అంత‌గా లేకున్న ఈ మ‌ధ్య బాగా వార్త‌ల్లో నిలుస్తోంది స‌మంత (Samantha Ruth Prabhu). ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి బ‌య‌ట ప‌డుతున్న ఆమె మ‌ళ్లీ సినిమాల్లో పుంజుకోవాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలో విదేశాల‌లో ఫొటోషూట్లు చేస్తూ నాలో ఇంకా వ‌న్నె త‌గ్గ‌లేద‌న్న‌ట్లుగా గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తోంది. చివ‌ర‌గా తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి సినిమాలో న‌టించిన‌ స‌మంత ఈ త‌ర్వాత‌ చేసిన బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ విడుద‌ల కావాల్సి ఉంది. ఈక్ర‌మంలోస‌మంత‌ తాజాగా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన‌ట్లు తెలుస్తోంది.

Samantha-2.jpg

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ (ThalapathyVijay) 69వ చిత్రంలో హీరోయిన్‌గా సమంత (Samantha)ను ఎంపిక చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతం విజయ్‌ 68వ చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ (The Greatest Of All Time)అనే టైటిల్‌ ఖరారు చేసిన విషయం తెల్సిందే. కల్పాతి అఘోరం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్నేహ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్‌, అజ్మల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబరు 5న ఈ చిత్రం విడుదల కానుంది.


samantha

అయితే విజ‌య్ (ThalapathyVijay) ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీ పెట్టి అందుకు ంబంధించిన కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంటున్నారు. అంతేకాకుండా కరానున్న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ఆయ‌న సినిమాల‌కు తాత్కాలికంగా విరామం ప్ర‌క‌టించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

samantha

ఈక్ర‌మంలో ఎల‌క్ష‌న్‌కు వెళ్లే ముందే త‌న 69వ చిత్రంలో నటించేందుకు కమిట్‌ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకే క‌థానాయుయిక‌గా స‌మంతను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. ఈ ప్రాజెక్టు నవంబరులో సెట్స్ పైకి వెళ్ళనుంది.ఇదిలాఉండ‌గా విజ‌య్ స‌మంత కాంబినేష‌న్‌లో గ‌తంలో మూడు నాలుగు చిత్రాలు కూడా వ‌చ్చాయి.

samantha

Updated Date - Jul 04 , 2024 | 04:05 PM