Prasad Behara: ప్రసాద్ బెహరాపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:14 PM

లైంగిక వేధింపుల కేసులో ప్రసాద్ బెహరా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో హీరోయిన్ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

పెళ్లి వారమండీ వంటి యూట్యూబ్‌ సిరీస్‌లతో పాపులర్‌ అయినా నటుడు ప్రసాద్‌ బెహరా. కమిటీ కుర్రాళ్లు చిత్రం మంచి అవకాశం దక్కించుకుని వరుస అవకాశాలు అందుకుంటున్న తరుణంలో లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యాడు. ప్రసాద్‌ మంచి రైటర్‌, ఆర్టిస్ట్‌ కూడా. సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కమిటీ కుర్రాళ్ళు, బచ్చల మల్లి చిత్రాల్లో మంచి పాత్రల్లో మెరిశాడు. పరిశ్రమకి మంచి నటుడు దొరికాడని భావిస్తున్న తరుణంలో లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లడం కలకలం రేపింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ ప్రసాద్ బెహరాపై సంచలన వ్యాఖ్యలు చేసింది.


ఆయనకు నోటి దూల చాలా ఎక్కువ అంటూ తెలుగు నటి రేఖా భోజ్ పరోక్షంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. ఆమె పోస్ట్ చేస్తూ.. "నా మొదటి సినిమా "కాలాయా తస్మై నమః" రిలీజ్ అయిన రెండవ రోజు అది. నా నటన చాలా నేచురల్ గా చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. అందులో నటించిన వాళ్ళందరం థియేటర్ దగ్గర ఉండి ప్రతి షోకి షో అయ్యాక థాంక్స్ చెప్తూ ఉన్నాము. నా మొదటి సినిమా కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇంట్లో పూజ చేసి పులిహోర ప్రసాదం తెచ్చాను. నాకు ఈ అదృష్టం కల్పించిన మా డైరక్టర్ గారికి ఒక బాక్స్ లో ఇచ్చాను. మధ్యాహ్నం షో అవుతోంది అప్పుడు. ఆయన అందరి ముందు నేను ఒక్కడిని తినను అంటే, రండి మీ కార్ లో కుర్చుందాం అక్కడ తినండి అన్నాను. ఇద్దరం వెళ్లి కార్లో కూర్చున్నాం, ఆయన తినగానే మళ్ళీ బయటకు వచ్చేసాం. అందులో నటించిన అందరూ మేము కార్లో ఉండగా కూడా చూశారు అండ్ మేమంతా కూడా మంచి ఫ్రెండ్స్. కానీ ఆ సినిమాలో ఒక చిన్న సైడ్ రోల్ చేసిన ఒక వ్యక్తి మాత్రం మరి ఏం అనుకున్నాడో ఎంటో తెలియదు. ఆ రోజు మా వైజాగ్ ఫిల్మ్ గ్రూప్స్ లో ఇలా ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు..


"రీసెంట్ గా రిలీజ్ అయినా ఒక సినిమా డైరెక్టర్, హీరోయిన్ ఇద్దరు అదే థియేటర్ లో కారులో దూరి బంచిక్ బంచిక్ చేసుకున్నారు, ఇది చూసి థియేటర్ వాళ్ళు వాళ్ళను తిట్టి బయటకు పంపారు. మన వైజాగ్ లో ఫిల్మ్ మేకర్స్ పరువు పోయింది ఇలాంటి వాళ్ళ వలన" అంటూ పూర్తిగా అబద్ధాలతో ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న మా టీమ్ అతడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో మళ్ళీ అవే గ్రూప్స్ లో "నేను పుష్కలంగా తాగి అలా మెసేజ్ పెట్టాను. నాది చాలా పెద్ద తప్పు . నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను" అని మెసేజ్ పెట్టాడు. అసలు ఇలా అతను ఎందుకు చేశాడో తెలియదు. ఆ తర్వాత అతడు హైదరాబాద్ వెళ్ళాడు, కష్టపడ్డాడు, అదృష్టం కూడా కలిసి వచ్చింది. కాస్త పేరు కూడా సంపాదించాడు. అతను మారాడు, లైఫ్ లో మెచ్యూరిటీ సాధించాడు అనుకున్నాను. కానీ.. అతను అదే నోటి దూలతో మొన్న అరెస్టు అయ్యాడు అని న్యూస్ చదివినప్పుడు.. ఇతను ఏమీ మారలేదు, ఇంకా అలానే ఉన్నాడు అనిపించింది" అంటూ రాసుకొచ్చింది.

Updated Date - Dec 21 , 2024 | 04:18 PM