Preity Mukhundhan: ఎవ‌రీ ‘క‌న్న‌ప్ప‌’ ప్రీతి ముకుంద‌న్.. చిన్న గ్లిమ్స్‌తో దేశ‌మంతా పాపుల‌ర్ అయింది

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:03 PM

మూడు రోజుల క్రితం మంచు క‌న్న‌ప్ప మూవీ టీజ‌ర్ రిలీజైన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అందులో ప్ర‌భాస్ లుక్స్ త‌ర్వాత ఎక్కువ‌గా మెస్మ‌రైజ్ చేసింది త‌మిళ బ్యూటీ ప్రీతి ముకుంద‌న్. ఇప్పుడీ అమ్మ‌డి గురించి దేశ‌వ్యాప్తంగా చాలామంది ఆరా తీయ‌డం ప్రారంభించారు.

Preity Mukhundhan: ఎవ‌రీ ‘క‌న్న‌ప్ప‌’ ప్రీతి ముకుంద‌న్.. చిన్న గ్లిమ్స్‌తో దేశ‌మంతా పాపుల‌ర్ అయింది
Preity Mukhundhan:

ప్ర‌స్తుతం మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలో అన‌శ్వ‌ర రాజ‌న్ (Anaswara Rajan), మ‌మితా బైజు (Mamitha Baiju).. క‌న్న‌డ నాట రుక్మిణీ వ‌సంత్ (Rukmini Vasanth), స‌ప్త‌మి గౌడ (Sapthami Gowda) వంటి న‌వ క‌థానాయిక‌లు వ‌రుస చిత్రాల‌తో దుమ్ము రేపుతున్నారు. అదే కోవ‌లో బాలీవుడ్‌లో ర‌ష్మిక (Rashmika Mandanna), కృతి స‌న‌న్ (Kriti Sanon), త‌మిళంలో ఇవానా (Ivana), ప్రియాంక మోహ‌న్ (Priyanka Mohan) కుర్ర‌కారు క‌ల‌ల రాణులుగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలుగు నాట అయేషా ఖాన్ (Ayesha Khan), ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan) ఆ జాబితాలో చేరారు.

31.jpg

ఇప్ప‌టికే అయేషా ఖాన్ (Ayesha Khan) పాత్ర‌తో సంబంధం లేకుండా ఐటం సాంగ్స్‌, చిన్న క్యారెక్ట‌ర్స్‌తో తెలుగులో అర డ‌జ‌న్ చిత్రాల‌ వ‌ర‌కు చేస్తుండ‌గా.. రీసెంట్‌గా వ‌చ్చిన‌ ఓం భీం భుష్ (Om Bheem Bush) చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan) క్ర‌మంగా వ‌రుస ఛాన్సులను ద‌క్కించుకుంటూ అగ్ర స్థానానికి చేరేలా క‌నిపిస్తోంది.

Preity Mukhundhan:

తాజాగా అమె న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం క‌న్న‌ప్ప నుంచి అమె స్టిల్స్ బ‌య‌ట‌కి వ‌చ్చాక ఇప్పుడు అంద‌రి దృష్టి ఈ అమ్మ‌డిపై ప‌డింది. గ‌త నెలలో ఈ అమ్మ‌డు తమిళంలో కెవిన్‌తో న‌టించిన‌ స్టార్ అనే సినిమాతోనూ ఆక‌ట్టుకుని అంద‌రి అటెన్ష‌న్‌ను త‌న వైపు తిప్పుకుంది.

Preity Mukhundhan:


త‌మిళ‌నాడుకు చెందిన ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan) మంచి క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్‌. ఇప్ప‌టికే చెన్నై షాపింగ్ మాల్ వంటి చాలా షోరూంస్ ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌తో త‌మిళ‌, తెలుగు నాట‌ బాగా పాపుల‌ర్ అయింది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లే శ్రీవిష్ణు హీరోగా వ‌చ్చిన ఓం భీం బుష్ (Om Bheem Bush) చిత్రంతో హీరోయిన్‌గా ఆరంగేట్రం చేసింది. ఆ వెంట‌నే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప (Kannappa)లో అవ‌కాశం ద‌క్కించుకుంది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా అందులో ప్రీతి విజువ‌ల్స్ అంద‌రినీ మెస్మ‌రైజ్ చేశాయి.

Preity Mukhundhan:

చాలామంది ఇందులో ప్ర‌భాస్ లుక్స్ త‌ర్వాత ఈ అమ్మ‌డి గురించే ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్నారంటే అతిశ‌యోక్తి కాదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల‌లో యూత్ ఎవ‌రీ ప్రీతి (Preity Mukhundhan) అంటూ సెర్చ్ చేస్తున్నారు.

Preity Mukhundhan:

ఈ అమ్మ‌డు రాబోవు రోజుల్లో అగ్ర స్థానానికి వెళ్లే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ తారాస్థాయికి చేరుకుంటుందో లేదో. ఆల్ ది బెస్ట్ ప్రీతి ముకుంద‌న్.

Preity Mukhundhan:

Updated Date - Jun 17 , 2024 | 03:56 PM