Megha Akash: ప్రియుడితో.. మేఘా ఆకాష్‌ నిశ్చితార్థం

ABN , Publish Date - Aug 25 , 2024 | 10:27 AM

తెలుగు, తమిళ చిత్రపరిశ్రమల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ హీరోయిన్‌ మేఘా ఆకాష్. నితిన్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లై సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన చిరకాల ప్రియుడు సాయివిష్ణుతో నిశ్చితార్థం చేసుకుంది.

megha akash

తెలుగు, తమిళ చిత్రపరిశ్రమల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ హీరోయిన్‌ మేఘా ఆకాష్ (Megha Akash). 2017లో నితిన్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లై సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత వెంట‌నే చ‌ల్ మోహ‌న‌రంగా సినిమాలోనే న‌టించి మెప్పించింది. ఆపై త‌మిళ సినిమాల‌వైపు దృష్టి పెట్టిన ఈ తెలుగందం రెండు భాష‌ల్లో వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నిఅందిపుచ్చుకుంటు సినిమాలు చేస్తోంది.

GVpBPdJXEAAYv6d.jpeg

తమిళంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘పేట’ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించిన ఆమె.. ఆ తర్వాత ‘వందా రాజావాదాన్‌ వరువేన్‌’, ‘బూమరాంగ్‌’, ‘ఎన్నై నోక్కిపాయుం తోట్టా’, ‘వడకుపట్టి రామస్వామి’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించారు. ఇటీవ‌లే విజయ్‌ ఆంటోని తుఫాన్ అనే త‌మిళ సినిమాతో అల‌రించిన మేఘ ప్ర‌స్తుతం రెండు తెలుగు చిత్రాల్లో చేస్తోంది.


GVpBNEqXMAAI1lV.jpeg

అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన చిరకాల ప్రియుడు సాయివిష్ణు(Saai Vishnu) తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని మేఘా ఆకాష్‌.. తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించారు. ‘మై విష్‌ కమ్‌ ట్రూ’ అంటూ కామెంట్స్‌ చేసి, తన ప్రియుడు బుగ్గపై ముద్దుపెడుతున్న చిత్రాన్ని షేర్‌ చేశారు. ‘ప్రేమ, నవ్వు, ఆనందం.. ఎప్పటికీ నా జీవితంలోని ప్రేమతో నిశ్చియం చేశారు’ అని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మేఘా ఆకాష్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Updated Date - Aug 25 , 2024 | 10:27 AM