Rave Party - Hema: షరతులతో కూడిన బెయిల్ మంజూరు!
ABN , Publish Date - Jun 13 , 2024 | 11:26 AM
బెంగళూరు రేవ్ పార్టీ(Rave party), డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు(Hema) ఊరట కలిగింది. విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బెంగళూరు రేవ్ పార్టీ(Rave party), డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు(Hema) ఊరట కలిగింది. విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో ఈ నెల 3న బెంగళూరు సీసీబీ డిపార్ట్‌మెంట్ హేమను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే! జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా పరపన్న అగ్రహారం జైలులో హేమను ఉంచారు. ఆమె తరపు న్యాయవాది పిటీషన వేయగా వాదన విన్న న్యాయమూర్తి బెయిల్ మంజూరు (Hema Got bail) చేశారు. గురువారం ఆమె బయటకు రానుంది.
ఈ నెల మూడో తేదీన హేమ సీసీబీ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలోనే బెంగళూరు సీసీబీ టీమ్ ఆమెను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 14 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అప్పుడే ఆమె తరఫు న్యాయవాది హేమకు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ వేశారు. బుధవారం జరిగిన విచారణ అనంతరం బెయిల్ మంజూరు చేశారు. అయితే షరతుల ప్రకారం సీసీబీ కోరిన సందర్భంలో ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.