CCL: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. CCL సెకండ్ సీజ‌న్ ఎప్ప‌టినుంచంటే?

ABN , Publish Date - Jul 21 , 2024 | 08:39 PM

గ‌డిచిన ఫిబ్రవరిలో టీసీఏ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన‌ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ను నవంబర్ లో నిర్వహించేందుకు రెడీ అవుతోంది.

ccl

గ‌డిచిన ఫిబ్రవరిలో టీసీఏ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన‌ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ను నవంబర్ లో నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ సాయికృష్ణ, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్ మరియు ఓంకార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్, తరుణ్ మాట్లాడుతూ.. టీసీఏ 2006లో స్థాపించారు. ఇలా సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ద్వారా క్రికెట్ మ్యాచ్ ఆర్గనైజ్ చేసి చారిటీ ద్వారా సహాయం అందిస్తున్న సాయి కృష్ణ గారికి మా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా దేశాల్లో క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. ఒకే సంవత్సరంలో రెండు సీజన్లు నిర్వహించడం అనేది అంత ఈజీ కాదు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల నవంబర్లో సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ఆడించడం అంత ఈజీ కాదు. అలాంటిది సీజన్ 2 నిర్వహిస్తున్నారు. నవంబర్ 15, 16 జరిగే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. ఇప్పటివరకు ఆడిన ఏ చారిటీ మ్యాచ్ కూడా మనం ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం. సీజన్ 1 లో కూడా గెలిచాం. ఈ సీజన్ 2 కూడా గెలిచి ట్రోఫీ లిఫ్ట్ చేస్తామని కచ్చితంగా చెప్తున్నామ‌న్నారు. నవంబర్ లో జరిగే ఈవెంట్ కి సెప్టెంబర్ లో కర్టెన్ రైజర్ కార్యక్రమం ఉంటుందన్నారు.


ccl

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. మాకు ఉన్న స్ట్రెస్ కి ఒక రిలీఫ్ గా ఫీలయ్యేది క్రికెట్ మ్యాచ్. ఈవినింగ్ వర్క్ అయిపోయాక మేమంతా కలుసుకునేది క్రికెట్ గ్రౌండ్ లోనే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా వెళ్లి సీజన్ 1 ఆడి వచ్చాము. ఆస్ట్రేలియాలో మాకొచ్చిన రిసెప్షన్ చూసి ఆశ్చర్యం వేసింది. సాయి ఇంత గ్రాండ్ గా ఒక చారిటీ కోసం సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. సీజన్ 1 ఎలా అయితే సక్సెస్ అయిందో సీజన్ 2 కూడా అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఫౌండర్ సాయి కృష్ణ గారు మాట్లాడుతూ : ఫిబ్రవరిలో సీజన్ 1 నిర్వహించాం. హీరో శ్రీకాంత్ గారు హీరో తరుణ్ గారు ముందు నుంచి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సెలబ్రిటీస్ అందరూ ఎంతో బిజీగా ఉన్నా చారిటీ కోసం వచ్చి క్రికెట్ ఆడి సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

హీరో ఆది సాయికుమార్, అశ్విన్ బాబు, సుశాంత్ , సామ్రాట్, ఓంకార్ మాట్లాడుతూ.. టీసీఎ ఎప్పుడు క్రికెట్ మ్యాచెస్ పెట్టినా దానికి ఒక మంచి కారణం ఉంటుంది. ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడినప్పుడు ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ చారిటీ కోసం ఆడాం. ఈ సీజన్ టు కూడా అదే మంచి కారణం కోసం ఆడడం మంచి విషయం. సినిమా ప్రమోషన్స్ వల్ల కొంతమంది రాలేక పోయారు. కర్టెన్ రైజర్ ఈవెంట్ కి అందరూ వస్తారని అన్నారు. మా అందరికీ క్రికెట్ అంటే ఇష్టం. మేమందరం సినిమా పరంగా ఎక్కువ కలవకపోయినా క్రికెట్ గ్రౌండ్లో కచ్చితంగా కలుస్తాం. ఒక చారిటీ కోసం ఇలా క్రికెట్ మ్యాచ్ ఆడడం చాలా మంచి విషయం. అప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు అదే చారిటీ కోసం సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సీజన్ 2 పోస్టర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. సీజన్ 1 కంటే సీజన్ 2 పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామ‌న్నారు.

Updated Date - Jul 21 , 2024 | 08:39 PM