Kannappa The Movie: మొన్న ముండ‌డు, నిన్న చుండ‌డు, నేడు కంప‌డు! క‌న్న‌ప్ప నుంచి మ‌రో అప్డేట్

ABN , Publish Date - Aug 19 , 2024 | 01:34 PM

డైన‌మిక్ హీరో మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ చిత్రం నుంచి తాజాగా మ‌రో అప్డేట్ వ‌చ్చింది. ముఖేష్ రిషి పోషించిన ‘కంప‌డు’కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

kampadu

డైన‌మిక్ హీరో మంచు విష్ణు (Vishnu Manchu) క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’.(Kannappa Movie) ఈ చిత్రం నుంచి తాజాగా మ‌రో అప్డేట్ వ‌చ్చింది. మేక‌ర్స్ గ‌తంలో చెప్పిన మాదిరిగానే ప్ర‌తి సోమ‌వారం ఓ పాత్ర‌కు సంబంధించిన లుక్ విడుద‌ల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని మ‌రింత‌గా పెంచేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి శ‌ర‌త్ కుమార్ నాథ నాథుడు, మ‌ధుబాల ప‌న్న‌గ‌, దేవ‌రాజ్‌ ముండ‌డు, సంప‌త్ రామ్ చుండ‌డు, వంటి పాత్ర‌ల‌ను రివీల్ చేయ‌గా తాజాగా ఈ సోమ‌వారం ముఖేష్ రిషి (Mukesh Rishi) పోషించిన ‘కంప‌డు’(Kampadu)కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా కంప‌డు పాత్ర‌కు సంబంధించిన వివ‌రాలు, వాడిన అయుధం గురించి తెలియ జేశారు. అత్యంత పురాత‌నమైన పుళిందుల జాతి స‌దాశివ కొండ‌ల్లో నివ‌సిస్తూ ఉంటుంది. వంశ పారంప‌ర్యంగా వాయి లింగాన్ని సంర‌క్షించే భాధ్య‌త వీరికి ఉంటుంది. ఈ పుళింద జాతినే భ‌ద్ర గ‌ణం అంటూ ఉంటారు దానికి నాయ‌కుడే ఈ కంప‌డు. ఈ భ‌ద్ర గ‌ణంలోనే గ‌వ్వ‌రాజు (Gavvaraju) అనే పాత్ర‌లో సీనియ‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ (Brahmaji) క‌నిపించ‌నున్నాడు. ఈ పోస్ట‌ర్‌లో న‌టుల వేష ధార‌ణ‌లు, ఆ ప్రాంత చ‌రిత్ర, వారి అయుధాలు, బాధ్య‌తలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.


GVU75vbasAAxqOp.jpeg

భారీ తారాగ‌ణంతో పాన్ ఇండియా సినిమాగా వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం న్యూజీలాండ్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అక్ష‌య్ కుమార్‌, ప్ర‌భాస్‌, మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, బ్రహ్మానందం, మ‌ధుబాల‌, శ‌ర‌త్ కుమార్‌, మోహ‌న్ బాబు, దేవ‌రాజ్‌వంటి మ‌హామ‌హులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళ బ్యూటీ ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan)క‌థానాయుక‌గా న‌టిస్తోంది. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు.

Updated Date - Aug 19 , 2024 | 01:34 PM