Kovai Sarala: పెళ్లి చేసుకుంటేనే జీవించాలా.. అల్లు అర్జున్‌ను చేసుకుంటా

ABN , Publish Date - May 08 , 2024 | 07:14 AM

సౌత్ ఇండియా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు కోవై స‌ర‌ళ. త‌న టైమింగ్‌, త‌న కామెడీతో ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర్చుకుంది. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ అవ‌కాశం ఉంటే ఐకాన్‌స్టార్‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఉందంటూ చాలా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

Kovai Sarala: పెళ్లి చేసుకుంటేనే జీవించాలా.. అల్లు అర్జున్‌ను చేసుకుంటా
sarala

సౌత్ ఇండియా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు కోవై స‌ర‌ళ (Kovai sarala). త‌న టైమింగ్‌, త‌న కామెడీతో ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర్చుకుంది. ఈ మ‌ధ్య సినిమాల్లో త‌క్కువ‌గా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జల్లో క్రేజ్ మాత్రం అదే రేంజ్‌లో ఉంది. 2016లో వ‌చ్చిన నాయ‌కి అనే తెలుగు స్ట్రెయిట్ చిత్రంలో చివ‌ర‌గా క‌నిపించిన స‌ర‌ళ (Kovai sarala) ఆ త‌ర్వాత త‌మిళ సినిమాల్లో న‌టించింది. ఈ క్ర‌మంలో 2022లో త‌మిళంలో వ‌చ్చిన సెంబీ చిత్రంలో సిరీయ‌స్ పాత్ర‌లో న‌టించి ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేసింది.

తాజాగా కోవై స‌ర‌ళ (Kovai sarala) ఫుల్ లెంగ్త్‌లో న‌టించిన త‌మిళ చిత్రం అర‌ణ్మై4 తెలుగులో బాక్ అనే సినిమాలో న‌టించగా ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటుంది. ఈ క్ర‌మంలో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ అవ‌కాశం ఉంటే ఐకాన్‌స్టార్‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఉందంటూ చాలా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం 62 ఏళ్లు దాటిన కోవై స‌ర‌ళ (Kovai sarala) పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగానే జీవిస్తోంది. తాజాగా ప్ర‌ముఖ క‌మెడియ‌న్ అలీ (Ali) నిర్వ‌హిస్తోన్న ఓ షోలో పాల్గొంది.

kovai sarala.jpg


ఈ సంద‌ర్భంగా అలీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌ర‌ళ (Kovai sarala) ఇంట్రెస్టింగ్ జ‌వాబులు ఇచ్చింది. ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదని అలీ (Ali) అడ‌గ్గా పెళ్లి అనేది నాకు ఇష్టం లేదని.. అయినా పెళ్లి చేసుకుంటేనే జీవించాలని ఏమైనా రూల్ ఉందా ఉంటూ ఎదురు ప్ర‌శ్నించింది. ఛాన్సు ఉంటే ఇప్పుడున్న టాలీవుడ్ హీరోల‌లో ఎవ‌రిని పెళ్లి చేసుకోవాల‌ని ఉందని అడ‌గ‌గా, మరోమాట లేకుండానే అల్లు అర్జున్ (Allu Arjun)ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

Updated Date - May 08 , 2024 | 07:14 AM