Kalki 2898AD: కల్కి టీమ్‌కు షాక్.. నోటీసులిచ్చిన పీఠాధిపతి!
ABN , Publish Date - Jul 21 , 2024 | 07:50 PM
కల్కి సినిమా విడుదలై దాదాపు మాసం దగ్గర పడుతున్నా మూవీ నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. తాజాగా ఈ మూవీ టామ్‌కు గట్టి షాక్ తగిలింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ లీగల్ నోటీసు పంపారు.
కల్కి (Kalki 2898AD) ఈ సినిమా విడుదలై దాదాపు మాసం దగ్గరపడుతున్నా మూవీ నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు, ఇన్ని కోట్లు దాటిందనే మంచి వార్తలతో పాటే మహా భారతాన్ని వక్రీకరించారనే విమర్శలు సైతం వస్తున్నాయి. అయితే తాజాగా కల్కీ (Kalki 2898AD) మూవీ టామ్‌కు గట్టి షాక్ తగిలింది.
హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ అమితాబ్ బచ్చన్‌తో సహా 'కల్కి 2898 AD' (Kalki 2898AD) నిర్మాతలు మరియు నటులకు కల్కి పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం (PramodKrishnam ) లీగల్ నోటీసు పంపారు.
ఈ సందర్భంగా ప్రమోద్ కృష్ణం మాట్లాడుతూ “సనాతన గ్రంథాలను మార్చకూడదని సినిమా పేరుతో తమకు ఇష్టమొచ్చిన విధంగా భారతాన్ని తయారు చేస్తున్నారని, హిందువుల మనోభావాలతో ఆడుకోవడం సినిమావాళ్లకు కాలక్షేపంగా మారింది.. ఇక సహించేది లేదు’’ అని హెచ్చరించారు. కల్కి నారాయణుడు మన విశ్వాసానికి కేంద్రంగా ఉన్నాడని, కథానాయికకు కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నట్లుగా చూపించి వందల కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీశారని నోటీసులో ఆరోపించారు.